అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది

22 Nov, 2021 15:56 IST|Sakshi

కారు కింద పడి చిన్నారి మృతి

సాక్షి,నాగోలు(హైదరాబాద్‌): ఓ వాచ్‌మెన్‌ కారును రివర్స్‌ తీసుకుంటుండగా కారు చక్రాలకింద పడి అతని కుమారుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అంగీర్ల రాణీ, లక్ష్మణ్‌ భార్యభర్తలు. వీరికి కుమారుడు సాత్విక్‌ (2) ఉన్నాడు. గత సంవత్సరం ఎల్‌బీనగర్‌లో కాస్మోపాలిటన్‌ కాలనీ రాణీ అపార్మ్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మణ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఆదివారం అపార్ట్‌మెంట్‌ దగ్గర లక్ష్మణ్‌ ఇన్నోవా క్రిస్టా కారును క్లీన్‌ చేసి కారును రివర్స్‌లో తీస్తుండగా వెనకాల సైడ్‌నుంచి వచ్చిన లక్ష్మణ్‌ కుమారుడు సాత్విక్‌ కారు వెనుక చక్రాల కింద పడడంతో  తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన లక్ష్మణ్‌ .. కుమారుడిని చికిత్స నిమిత్తం ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సాత్విక్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమచారం అందుకున్న  ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: గూగుల్‌లో వాటి కోసం వెతికారా.. మన బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీనే!

మరిన్ని వార్తలు