హైదరాబాద్‌లో జవాన్‌ ఆత్మహత్య

15 Nov, 2023 11:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్‌లో ఆర్మీ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన రాజిందర్ బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
చదవండి: రమేష్‌ కుమార్‌ జైస్వాల్‌ ఎక్కడ?

మరిన్ని వార్తలు