బంజారాహిల్స్‌: బాలికపై మేనమామ లైంగిక దాడి 

10 Jul, 2022 12:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ బాలికపై ఆమె మేనమామ లైంగికదాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  ఈ నెల 2న ఫిలింనగర్‌ సమీపంలోని హకీంపేటలో నివసించే బాలిక(14) తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో  ఆమె మేనమామ సయ్యద్‌ రషీద్‌ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడు రోజులుగా బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతుండగా గుర్తించిన ఆమె తల్లి ఆరా తీసింది. దీంతో ఆమె  సయ్యద్‌ రషీద్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది.  బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు