దుస్తులు విప్పేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది

1 Mar, 2021 17:27 IST|Sakshi

ముంబై : క్షుద్ర పూజల పేరిట మైనర్‌పై వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  కొద్దిరోజుల క్రితం నాగ్‌పూర్‌కు చెందిన విక్కి గణేష్‌ ఖప్రే అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌తో స్నేహం చేసుకున్నాడు. ప్రత్యేక పూజలు చేస్తే ఆమె అత్యంత సంపన్నురాలు అవుతుందని నమ్మబలికాడు. ఇందు కోసం తాము చెప్పినట్లు చేయాలని కోరాడు. ‘‘ పూజల్లో భాగంగా దుస్తులు విప్పేస్తే.. 50 కోట్ల రూపాయల డబ్బుల వర్షం కురుస్తుంది’’ అని చెప్పాడు.

అయితే దీనిపై అనుమానం వ్యక్తం చేసిన మైనర్‌ అతడికి దూరంగా ఉండసాగింది. అయినప్పటికి విక్కి.. మైనర్‌పై ఒత్తిడి తేసాగాడు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. విక్కిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని కూడా అరెస్ట్‌ చేశారు. 

చదవండి : రోడ్లపై యువతుల దందా..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు