కడుపులో కత్తితోనే పోలీస్‌స్టేషన్‌కు పరుగు 

9 Jun, 2021 14:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి  

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

నాగపూర్‌: తనపై కత్తితో దాడి చేసిన వారి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. కడుపులో కత్తి దిగి తీవ్రంగా రక్తం కారుతున్నప్పటికీ అలాగే పోలీస్‌ స్టేషన్‌ వైపు వేగంగా పరిగెత్తాడు. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటనలో ఆ వ్యక్తి చివరికి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. నాగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు అర కిలో మీటర్‌ దూరంలో ఉన్న బహిరంగ మైదానంలో ఆదివారం రాత్రి పాత కక్ష్యల నేపథ్యంలో ఓ 20 ఏళ్ల వ్యక్తిని కొందరు కడుపులో కత్తితో పొడిచారు.

దాంతో బాధితుడు కడుపులో ఉన్న కత్తితోనే పోలీస్‌ స్టేషన్‌ వైపు పరుగుపెట్టాడు. కొంతదూరం పరుగెత్తిన తర్వాత స్నేహితుడు లిఫ్ట్‌ ఇవ్వడంతో పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్నాడు. బాధితుడిని పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. దాడి ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

చదవండి: అధికారి భార్య ఆత్మహత్య

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు