రెండేళ్లుగా సహజీవనం.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..!

1 Dec, 2022 07:31 IST|Sakshi
కృష్ణకుమారి (ఫైల్‌), నిందితుడు సంతోష్‌ దాలి

సాక్షి, బెంగళూరు: సహజీవనం సాగిస్తున్న ప్రియురాలిని  దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తినగరలో జరిగింది. ఇద్దరూ కూడా నేపాల్‌కు చెందినవారే. వివరాలు.. నేపాల్‌కు చెందిన కృష్ణకుమారి (23), సంతోష్‌ దాలి (27) మూడేళ్ల కిందట వేర్వేరుగా బెంగళూరుకు వచ్చారు. రెండేళ్ల కిందట ఒకరికొకరు పరిచయమమై ప్రేమగా మారి ఒకే ఇంట్లో సహజీవనం సాగిస్తున్నారు. కృష్ణకుమారి హొరమావులోని ఒక స్పాలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. సంతోష్‌ టీసీ పాళ్యలో అదే వృత్తిలో ఉన్నాడు.

అనుమానం పెనుభూతమై..  
కొంతకాలంగా అతడు ప్రియురాలి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి ఆమెను కొట్టి గొంతు నులిమాడు. ఆమె అచేతనంగా పడిపోవడంతో ఆస్పత్రికి తరలించాడు.  అర్ధరాత్రి 1.30 గంటలకు ఆస్పత్రి నుంచి కాల్‌ వచ్చినట్లు డీసీపీ భీమా శంకర్‌ గుళేద్‌ తెలిపారు.

తక్షణమే ఆస్పత్రికి వెళ్లి చూడగా కృష్ణకుమారి మరణించి ఉందని తెలిపారు. హత్య కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల నుంచి ఒకే ఇంట్లో జీవిస్తున్నారని, వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని కృష్ణకుమారితో సంతోష్‌ గొడవ పడేవాడని చెప్పారు. సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.     

చదవండి: (గొల్లపల్లి యువకుడు భార్గవ్‌కు లక్కీ ఛాన్స్‌.. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు