రెండు లారీల మధ్య బొలెరో నుజ్జు 

24 Mar, 2021 08:42 IST|Sakshi
రెండు లారీల మధ్య చిక్కుకున్న బొలెరో 

 

సాక్షి, యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా, యల్లాపుర తాలూకా అరబైల్‌ఘట్ట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య బొలెరో వాహనం ఇరుక్కుపోయి ఒక మహిళ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాగలకోటె జిల్లా లోకాపురకు చెందిన 8 మంది గోకర్ణకు బయలుదేరారు. అరబైల్‌ఘట్ట వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంతో  లారీ ఢీకొంది. ఈ వేగానికి బొలెరో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా తాకింది.

రెండు వాహనాల మధ్య బొలెరో ఇరుక్కుపోయి నుజ్జయ్యింది. స్థానికులు వచ్చి బొలెరోలో ఉన్నవారికి బయటకు తీశారు. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను  యల్లాపుర ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.   

మరిన్ని వార్తలు