వ్యభిచార గృహంపై పోలీసుల దాడి‌

26 Mar, 2021 14:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అమలాపురం టౌన్(తూర్పుగోదావరి)‌: అమలాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్న సమాచారం అందుకున్న పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ గురువారం ఉదయం నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీఐ బాజీలాల్‌ చెప్పారు. సెక్స్‌ వర్కర్లకు హెచ్‌ఐవీ పరీక్షలు, ఇతర సలహాలు ఇచ్చే ముమ్మిడివరానికి చెందిన ఓ మహిళ ఇటీవల అమలాపురంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న కడియం రవితో పరిచయం ఏర్పడింది. వారిద్దరు కలసి హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి కొందరిని తీసుకువచ్చి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు.

పక్కా సమాచారం రావడంతో సీఐ బాజీలాల్, ఎస్సై సురేష్‌బాబు ఆ గృహంపై దాడిచేసి ఒక అమ్మాయి, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు నిర్వాహకులు పట్టుబడ్డారు. అమలాపురం రూరల్‌ మండలం నల్లమిల్లికి చెందిన గెడ్డం ప్రసాద్, అల్లవరం మండలం మొగళ్లమూరుకు చెందిన తాడి పౌలు, ఇద్దరు ఆటో డ్రైవర్లు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకారని సీఐ చెప్పారు. పట్టుబడ్డ అమ్మాయిని మహిళా సంరక్షణాలయానికి పంపిస్తామన్నారు. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న మహిళతో పాటు రవితో పాటు ప్రసాద్, పౌలులను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.
చదవండి:
ప్లీజ్‌ డాడీ.. అమ్మను ఏం చేయొద్దు
ఫేస్‌బుక్‌ ప్రేమ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని.. 

  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు