పైన చూస్తే చింతపండు.. లోపలే ఉంది అసలు మ్యాటర్‌!

8 Apr, 2022 18:08 IST|Sakshi
కలిమెల పోలీస్‌ స్టేషన్‌ బయట పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలు

మల్కన్‌గిరి(భువనేశ్వర్‌): జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ–31 గ్రామం వద్ద మల్కన్‌గిరి ఎస్‌డీపీఓ సువేందుకుమార్‌ పాత్రొ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. చింతపండు లోడ్‌తో ట్రక్‌ను తనిఖీ చేయగా, 15 క్వింటాళ్ల గంజాయి బయట పడింది. డ్రైవర్‌ కన్నరామ్‌ చౌదరి, వ్యాపారి ప్రతామ్‌ పాత్రొను అరెస్ట్‌ చేశారు.

అతివేగంగా వెళ్తున్న ట్రక్‌పై అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా.. 63 బస్తాల్లో నింపి, చింతపండు లోడ్‌ మధ్య తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని ఎస్‌డీపీఓ గురువారం ప్రకటించారు. నిందితులపై కేసు నమోదు చేసి, మల్కన్‌గిరి కోర్టులో హాజర్‌ పరిచారు. గంజాయిని మోటు మీదుగా తెలంగాణకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు.

చదవండి: చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే..

మరిన్ని వార్తలు