రాసలీలల సీడీ కేసు: సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నో!

19 Apr, 2021 10:23 IST|Sakshi

సాక్షి, బెంగళూరు/బనశంకరి: మాజీమంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసును సిట్‌ నుంచి సీబీఐకి అప్పగించే అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు న్యాయవాదులు వేసిన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌.ఓకా నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. పిటిషనర్ల వాదనల్ని ఆలకించిన న్యాయపీఠం, సిట్‌ చీఫ్‌ సౌమేందు ముఖర్జీ అందించిన విచారణ నివేదికను పరిశీలించింది.

ఈ సందర్భంగా, ఈ కేసులో నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లనూ తనిఖీ చేసి కేసు సీబీఐకి అప్పగించాల్సిన పని లేదని పేర్కొంటూ, తదుపరి విచారణను మే 31 కి వాయిదా వేసింది. కేసు దర్యాప్తు సమాచారం మీడియాకు లీక్‌ అవుతోందని, టీవీ చానెళ్లలో విచారణ మాదిరిగా చర్చాగోష్టులు నడుస్తున్నాయని అర్జీదారులు వాదించారు. మీడియాను కట్టడిచేయాలని కోరారు. ఈ వాదనల్ని తిరస్కరించిన న్యాయపీఠం ఏ ఆధారంతో ప్రభుత్వం మీడియాను కట్టడి చేయాలని ప్రశ్నించింది. 

చదవండి: రాసలీలల కేసు: అందుకే అలా చెప్పాను!‌

మరిన్ని వార్తలు