టీడీపీ మాజీ ఎమ్మెల్మే అక్రమాలపై దాడులు

26 Sep, 2020 09:04 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే  పీలా గోవింద సత్యనారాయణ అక్రమాలపై మూడో రోజు రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెందుర్తి బస్టాండ్ పక్క గెడ్డ ఆక్రమ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అక్రమాల బాగోతంపై వైస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఐదేళ్ల టీడీపీ పాలనలో  ప్రభుత్వ భూములను దోచుకున్నారని మండిపడ్డారు. పెందుర్తి పరిసరాల్లో ఎకరాల కొద్దీ భూమి వారి చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు లోతుగా విచారణ సాగిస్తే పీలా కుటుంబం అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. చదవండి: గోవిందా.. గోవిందా..?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు