శివ శివా.. ఏమిటీ అపచారం!

3 Sep, 2021 08:44 IST|Sakshi

సాక్షి,కర్నూలు(మహానంది): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహానందిలో గురువారం అపచారం చోటు చేసుకుంది. ఆలయ ఆవరణ, అందులోనూ ఈఓ ఇంటి వెనుకే కొందరు భక్తులు  మద్యం తాగుతూ కనిపించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు రెండు వాహనాల్లో మహానందికి వచ్చారు. ఈఓ ఇంటి వెనుక ఖాళీ ప్రదేశంలో కూర్చుని మద్యం తాగుతూ కాలక్షేపం చేస్తుండటంతో గమనించిన భక్తులు ఆవేదన చెందారు.

దేవదాయశాఖ నిబంధనల మేరకు ఆలయ ప్రాంగణంలోకి మద్యం, మాంసం తీసుకు రాకూడదు. కానీ ఇక్కడికి ఎలా వచ్చాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, దేవస్థానం అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని హిందూ ధర్మపరిరక్షణ సమితి, హిందూసంఘాల నాయకులు కోరుతున్నారు. కాగా వ్యక్తిగత లాభాపేక్షకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడి పవిత్రతను కాపాడేందుకు ఆలయ అధికారులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..

మరిన్ని వార్తలు