స్నేహితులతో కలిసి పిక్నిక్‌.. అక్కడ ఏం జరిగిందో శవమై తేలాడు

29 Nov, 2021 08:24 IST|Sakshi

సాక్షి,బొబ్బిలి(విజయనగరం): మండలంలోని భోజరాజపురం వేగావతి నది దగ్గరకు పిక్నిక్‌ వెళ్లిన ఓ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. పట్టణంలోని ఐటీఐ కాలనీకి చెందిన డి.సంతోష్‌కుమార్‌ (16) స్నేహితులతో కలిసి పిక్నిక్‌ కు వెళ్లి నదీతీరంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. కాగా సంతోష్‌కుమార్‌ తండ్రి మధుసూదనరావు, బంధువులు మాట్లాడుతూ ఫిట్స్‌ వల్ల సంతోష్‌కుమార్‌  మృతి చెందినట్లు చెబుతున్నారు.  

ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు
పాచిపెట: మండలంలోని చీపురువలస సమీపంలో ని పారమ్మకొండ వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు పారమ్మకొండకు  అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా ఆటో బ్రేకులు ఫెయిలవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్‌ ఆటోను నియంత్రించే క్రమంలో ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వెంటనే 108 సహాయంతో క్షతగాత్రులను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రుల్లో నక్కాన అరుణ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. 

చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’

మరిన్ని వార్తలు