మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం

14 Sep, 2020 20:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుల అరాచకాలు ఆగడం లేదు. నడిరోడ్డుపై ఎమ్మెల్యే అనుచరుడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం విశాఖలో చోటు చేసుకుంది. బాధితురాలి కొడుకు నరేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు.  వివరాలు.. విశాఖలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఎస్తేరు రాణి అనే మహిళ రోడ్డు పక్కన హోటల్‌ నడుపుతుంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ అనే వ్యక్తి తరచూ సదరు బాధిత మహిళ హోటల్ వెళ్లేడమే కాకుండా.. అక్కడ హోటల్ కొనసాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని బెదిరించేవాడు.

అంతేగాక తనతో సన్నిహితంగా ఉండకపోతే లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టు ఎస్తేరు రాణి పై తప్పుడు కేసు పెడతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రం కూడా బాధితురాలిని తనతోనే ఉండాలని బెదిరించాడు. అంతేగాక నడి రోడ్డుపైనే ఆమెపై వచక్షణంగా దాడికి తెగబడ్డాడు. దీంతో జరిగిన ఈ అవమానం తట్టుకోలేక సదరు బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే కింగ్ జార్జీఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె భావనగర్ వార్డులో చికిత్స పొందుతోంది ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై బాధితురాలి కొడుకు నరేష్‌ తన తల్లిపై జరిగిన దౌర్జన్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన ఈగల సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నరేష్‌  ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా