శిరోముండనం కేసులో నిందితులకు రిమాండ్‌

30 Aug, 2020 09:44 IST|Sakshi

సాక్షి, విశాఖ‌ప‌ట్నం: శిరోముండనం కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది. దీంతో నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్‌ జైలుకు తరలించారు. నిందితులను విచారించేందుకు కస్టడీ పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. మరోవైపు శిరోముండనం వ్యవహారంలో నూతన్‌ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక జ్యుడీషియల్‌ రిమాండ్‌ నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. అయితే కేజీహెచ్‌ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (చ‌ద‌వండి: దళిత యువకుడికి శిరోముండనం)

చ‌ద‌వండి: (కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు)

మరిన్ని వార్తలు