స్కిల్‌హబ్స్‌లో వివిధ కోర్సులలో శిక్షణ

19 Mar, 2023 02:20 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న ఆరిఫ్‌ తదితరులు

రాజమహేంద్రవరం రూరల్‌: నిరుద్యోగ యువతకు నియోజకవర్గ స్కిల్‌ హబ్స్‌లో వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నాక్‌ సంయుక్త ఆధ్వర్యంలో పీఎంకేవీవై 4.0 పథకం ద్వారా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎం.కొండలరావు ఓప్రకటనలో తెలిపారు. డొమెస్టిక్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌, అసిస్టెంట్‌ బ్యూటీ థెరపిస్ట్‌, అసోసియేట్‌ ఎలక్ట్రీషియన్‌, సర్వేయర్‌ ఎయిడ్‌, అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ – సీసీటీవీ, స్వీయింగ్‌ మెషీస్‌ ఆపరేటర్‌ (సీ్త్రలకు), అసెంబ్లీ ఆపరేటర్‌ – ఆర్‌ఏసీ, ఫిట్టర్‌ ఫ్యాబ్రికేషన్‌, అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ – ఎయిర్‌ కండీషనర్‌, డొమెస్టిక్‌ ఐటీ హాపీడేస్క్‌ అటెండెంట్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ –డొమెస్టిక్‌ నాన్‌ వాయిస్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. కోర్సుల్లో చేరడానికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి నుంచి పీజీ చేసిన వారి వరకూ అర్హులన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఉచితంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. అభ్యర్థులు ఆధార్‌ కార్డ్‌ జెరాక్స్‌, ఆధార్‌ లింక్డ్‌ ఫోన్‌ నెంబర్‌, ఈ మెయిల్‌ ఐడితో రాజమండ్రి అర్బన్‌ – 9133912947, రాజమండ్రి రూరల్‌ –9063648365 , రాజానగరం – 9959967534 , అనపర్తి – 9550882754 , గోపాలపురం – 8499943366 , కొవ్వూరు –7306232373 , నిడదవోలు – 9676052454 ఫోన్‌నెంబర్లలో సంప్రదించాలని కొండలరావు కోరారు.

వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చర్యలు

సీటీఆర్‌ఐ: వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేసినట్లు వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్‌ మొహమ్మద్‌ ఆరిఫ్‌ చెప్పారు. శనివారం సంస్థ కార్యాలయంలో జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ షఫీఉల్లా జిల్లాలో వక్ఫ్‌ ఆస్తులు, మసీదులు ఇతర వ్యవహారాలను వివరించారు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌ బోర్డ్‌ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, మసీదులు, దర్గాలు ఇతర సంస్థల ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై చర్చించారు. త్వరలోనే జిల్లాలో వక్ఫ్‌ బోర్డ్‌ ఆస్తులను ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక రిపొందించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జిల్లా వైస్‌ చైర్మన్‌ షేక్‌ వజీరుద్దీన్‌, జిల్లా డైరెక్టర్లు షట్టర్‌ బాషా, షేక్‌ అహ్మద్‌, పఠాన్‌ రహీం,జఫ్రుల్లా ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

20, 21వ తేదీలలో

ఆధార్‌ శిబిరాలు

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): జిల్లాలో 66 ప్రత్యేక అధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వూరు డివిజన్‌లో 20, రాజమహేంద్రవరం డివిజన్‌లో 46 కేంద్రాల ద్వారా ఆధార్‌ రెన్యువల్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తప్పని సరిగా రెన్యువల్‌ చేయించుకోవలసి ఉంటుందన్నారు. ఈనెల 20, 21వ తేదీలలో మండల కేంద్రాలు, గ్రామాలలో ప్రత్యేక శిబిరాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

రత్నగిరిపై ముగిసిన కంచి

పీఠాధిపతి విజయయాత్ర

అన్నవరం: కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ విజయయాత్ర శనివారం అన్నవరంలో దిగ్విజయంగా ముగిసింది. మధ్యాహ్నం స్దానిక రైల్వేస్టేషన్‌ రోడ్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని వార్తలు