బీచ్‌ బర్త్‌డే బేబీగా తారా!

20 Nov, 2020 19:19 IST|Sakshi

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి తార సుతారియా తన పుట్టినరోజును ప్రియుడు ఆదర్‌జైన్‌తో కలిసి మాల్దీవులలో జరుపుకున్నారు. తార బికినీ ధరించిన ఉన్న ఫోటోని ఆదర్‌ పోస్టు చేయడంతో ఈ ప్రేమ పక్షులు ఈ ద్వీప దేశంలో ఉన్నట్లు తెలిసింది. ‘‘అందాల యువరాణికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఆమెపై ప్రేమను చాటుకున్నాడు. ఇందుకు స్పందనగా.. ‘‘నా హృదయానికి ధన్యవాదాలు. నీతో నా జీవితం సంతోషంగా ఉంది’’ అని తార సమాధానమిచ్చింది. అంతేగాక తన ఫొటోకు ‘‘బీచ్‌ బర్త్‌ డే బేబీ’’ అని క్యాప్షన్‌ జత చేసింది. దీంతో ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజా చాట్‌తో తార, ఆదర్‌జైన్‌ రిలేషన్‌షిప్‌ ఇప్పటికైనా రివీల్‌ అయ్యింది అంటూ వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

కాగా వీరిద్దరు నటి మలైకా అరోరా పుట్టినరోజు వేడుకలో కలుసుకున్నారు. కలిసి ఫోటోలు దిగారు. తరువాత తరుచుగా కలుసుకోవడం ప్రారంభించారు. గత సంవత్సరం బిగ్‌బీ అమితాబ్‌ నిర్వహించిన దివాళీ వేడుకలో మరోసారీ కలుసుకున్న ఫోటోలు బయటపడటంతో  వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ పుకార్లు షికారు చేశాయి. కాగా తారా సుతారియా ప్రముఖ సింగర్‌,డాన్సర్‌. తన మొదటి సినిమా ‘‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’’ లో టైగర్‌ ఫ్రాఫ్‌,‌ అనన్యా పాండేతో కలిసి నటించింది. మసక్కలి 2.0లో నటించిన ఆమె, తడప్‌(ఆర్‌ఎక్స్‌ 100 రీమేక్‌) సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.

A post shared by TARA💫 (@tarasutaria)

మరిన్ని వార్తలు