ఈ విమానం మీరు ఎ‍క్కడికే వెళ్తే అక్కడికి వస్తుంది..!

11 May, 2021 13:04 IST|Sakshi

మగువల అందానికి అదనపు ఆకర్షణగా నిలిచేవి హ్యాండ్‌ బ్యాగ్స్‌. విదేశీ ప‍్రయాణాల్లో, పార్టీల్లోను, గెట్‌ టూ గెదర్‌ ఫంక్షన్‌లలో ఇతరులను ఆకట్టుకునేందుకు యువతులు రకరకాల డిజైన్లతో చేసిన హ్యాండ్‌ బ్యాగ్స్‌ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వారి ఇష్టాన్ని క్యాష్‌ చేసుకునేందుకు పలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీలు రకరకాల ఆకారాల్లో బ్యాగులను మార్కెట్లలో విడుదల చేస్తుంటాయి. వాటిలో ఎక్కువ శాతం బ్యాగులు​ ఆకట్టుకుంటే మరికొన్ని బ్యాగులు సహజత్వాన్ని కోల్పోయి నెటిజన్లకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ను మిగుల్చుతాయి.   

ఇటీవల ప్రముఖ అమెరికన్ డిజైనర్ వర్జిల్ అబ్లో ఫాల్ వింటర్ 2021తో విమానం ఆకారంలో ఉండే ఓ బ్యాగ్‌ను డిజైన్‌ చేశాడు. ఆ బ్యాగ్‌ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 28 లక్షలు(రూ.28,61,235) ఈ బ్యాగులను లూయిస్ విట్టన్ అనే ఫ్యాషన్‌ సంస్థ మార‍్కెట్‌ లో విడుదల చేసింది. మోనోగ్రామ్ లోగోతో డిజైన్‌ చేసిన ఈ బ్యాగ్‌ ను లూయిస్‌ విట్టన్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ప‍్రస్తుతం ఈ బ్యాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విమానం ఆకారంలో ఉన్న బ్యాగ్‌ను చూసి నెటిజన్లు బీభత్సంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

విమానం ఆకారంలో ఉండే బ్యాగ్‌ను డిజైన్‌ చేసే కంటే నువ్వే ఓ నిజమైన విమానం కొనుగోలు చేయోచ్చు కదా అని ఓ నెటిజన్‌ అంటుంటే.. మరో నెటిజన్‌ ఈ విమానాన్ని దొంగ తనం చేసి వీధుల్లో తిప్పుకుంటా! అందం లేదు, స్టైల్‌గానూ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు