'మైండ్‌ బ్లోయింగ్‌ ఆర్ట్‌'! ఏకంగా సూది రంధ్రంలోని బబుల్‌పై కళాఖండం! పెయింట్‌ బ్రెష్‌గా కనురెప్ప..

27 Dec, 2023 12:56 IST|Sakshi

ఎన్నో ఆర్ట్‌లు చూసి ఉంటాం. ఇలాంటి నెవ్వర్‌ బీఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌ ఆర్ట్‌ని చూసి ఉండటం అసాధ్యం. ఎందుకంటే..? ఇంతలా సూక్షంగా వేయడం ఒక ఎత్తైతే..పైగా బబుల్‌ పగిలిపోకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా వేయడం అనితర సాధ్యం. సుసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ అసాధారణ వ్యక్తి. ఇతనేం అందరిలాంటి వ్యక్తి కాదు కూడా. ఎందుకంటే? ఇతను చిన్నతనంలో ఆటిజంతో బాధపడిన వ్యక్తి. తస ఆర్ట్‌తో అందర్నీ విస్మయపరచడమే కాదు శభాష్‌ అని ప్రసంశలు అందుకున్నాడు. ఆ వ్యక్తి ఆర్ట్‌ జర్నీ ఎలా సాగింది? అనితర సాధ్యమైన ఆర్ట్‌ ఎందుకు వేశాడో అతని మాటాల్లో తెలుసుకుందామా!

విల్లార్డ్ విగాన్ ఇంగ్లాండ్‌లోని వెడ్నెస్‌ఫీల్డ్‌లోని అష్మోర్ పార్క్ ఎస్టేట్‌కు చెందిన బ్రిటిష్ శిల్పి. అతడు సూక్ష్మ శిల్పాలను రూపొందిస్తాడు. చాలామంది ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మ శిల్పలు రూపొందిస్తారు కానీ అతడు కేవడం సూదీ తల భాగంలో లేదా రంధ్రంలో వేస్తాడు. ఈసారి సూదీ రంధ్రంలో ఓ బబుల్‌పై ముగ్గురు వ్యక్తులు ఒంటెలపై ప్రయాణిస్తున్నట్లు వేశాడు. బబుల్‌ పగలకుంటా అత్యంత జాగ్రత్తగా వేయాలి. అందుకోసం అతడు రోజూకు 16 గంటలకు పైగా శ్రమను ఓర్చీ మరీ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. దీన్ని వేసేందుకు కంటి రెప్ప వెంట్రుకలతో తయారు చేసిన పెయింట్‌ బ్రెష్‌ని వినియోగించడం విశేషం.

నిజం చెప్పాలంటే ప్రతి నిమిషం ఉత్కంఠంగా ఊపిరి బిగబెట్టి గుండె లయలను వింటూ వేయాల్సింది. ఎందుకంట? ఆ ఆర్ట్‌ వేస్తున్నప్పుడూ ఏ క్షణమైన బబుల్‌ పగిలిందే మొత్తం నాశనమైపోతుంది. పడిన శ్రమ వృధా అయిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆర్ట్‌ అనితరసాధ్యమైన ఫీట్‌ అనే చెప్పాలి. ఆ ఆర్ట్‌లో ఒంటెలను నైలాన్‌తో రూపొందించగా, వాటిపై రాజుల్లా ఉన్న వ్యక్తుల కిరిటీలను 24 క్యారెట్ల బంగారంతో మెరిసేట్లు రూపొందించాడు. సూదీ రంధ్రంలో బుడగ పగిలిపోకుండా ఆధ్యంతం అత్యంత ఓపికతో శ్రమతో వేశాడు. చూసిన వాళ్లు సైతం ఇది సాధ్యమాఝ అని నోరెళ్లబెట్టేలా వేశాడు విల్లార్డ్‌ విగాన్‌. ఈ అసాధారణ కళా నైపుణ్యానికి గాను విల్లార్డ్‌ని 2007లో ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఎంపైర్‌ సభ్యుడిగా నియమించింది ఇంగ్లాండ్‌ ప్రభుత్వం. విల్లార్డ్‌ సుమారు 5 ఏళ్ల ప్రాయంలోనే చీమలకు ఇళ్లను కట్టే మైక్రో శిల్పాన్ని వేసి ఆశ్చర్యపరిచాడు. 

ఈ ఆర్ట్‌ వైపుకి ఎలా వచ్చాడంటే..
విల్లార్డ్‌ ఆటిజం కారణంగా చిన్నతనంలో అన్నింటిలోనూ వెనుకబడి ఉండేవాడు. దీంతో స్నేహితులు, టీచర్లు పదేపదే ఎగతాళి చేసేవారు. ఈ అవమానాల కారణంగా అతడి చదువు సరిగా కొనసాగలేదు. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు చదవడం, రాయడంలో చాలా వెనబడి ఉంటారు. ఈ రకమైన పిల్లలకు బోధించడం టీచర్లకు కూడా ఓ పరీక్ష లేదా సవాలుగానే ఉంటుంది. ఇక్కడ విల్లార్డ్‌ ఈ అవమానాలకు చెక్‌పెట్టేలా ఏదో ఒక టాలెంట్‌తో తానెంటో చూపించాలి. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని బలంగా అనుకునేవాడు. ఆ జిజ్ఞాశే విల్లార్డ్‌ని మైక్రో ఆర్ట్‌ వైపుకి నడిపించింది. చిన్న వయసు నుంచే ఈ మైక్రో ఆర్ట్‌లు వేసి టీచర్లను తోటి విద్యార్థులను ఆశ్చర్యపరిచేవాడు.

దీంతో క్రమంగా వారు కూడా అతడిని అవమానించటం, ఎగతాళి చేయటం మానేశారు. ఈ కళ అతడికి మంచి పేరునేగాక అందరీ ముందు విలక్షణమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. మనకు కొన్ని విషయాల్లో రోల్‌ మోడల్స్‌ ఉండాలి గానీ నాలాంటి వాళ్లకు రోల్‌మోడల్స్‌ ఉండరు. అందుకుని వారికీ తాను స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా ఉండాలనుకున్నాను. అని చెబుతున్నాడు విల్లార్డ్‌. మనం నిత్యం ఎన్నో సమస్యలు, బాధలతో సతమతమవుతాం. దాన్ని మనలో దాగున్న ఏదో నైపుణ్యంతో వాటిని పారద్రోలాలి.

ఆ స్కిల్‌ తెయకుండానే.. మీకు ఎదురైన చేదు అనుభవాలను సమస్యలకు చెక్‌ పెడుతుంది. అందుకు తానే ప్రేరణ అని విల్లార్డ్‌ చెబుతుంటాడు. అంతేగాదు ప్రపంచానికి సరికొత్త వెలుగునిచ్చేందుకు తాను ఈ కష్టతరమైన మైక్రో ఆర్ట్‌ వైపుకి వచ్చానంటున్నాడు. ఈ ఆర్ట్‌  ప్రతి ఒక్కరిలో ఆశ అనే ఒక మ్యాజికల్‌ కాంతిని,  శాంతిని అందజేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు విల్లార్డ్‌. దీని అర్థం చిన్న చిన్న సమస్య లేదా పర్వతం లాంటి సమస్య అయినా నువ్వు తల్చుకుంటే సాధ్యమే! అని విల్లార్డ్‌ తన ఆర్ట్‌తో చెప్పకనే చెబుతున్నాడు కదా!. 

(చదవండి:  కలవరపెడుతున్న 'జాంబీ డీర్‌ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?)

>
మరిన్ని వార్తలు