అవుట్‌డోర్‌ కుక్‌వేర్‌..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు

16 Jul, 2023 10:27 IST|Sakshi

అలా సరదాగా.. ప్రకృతి ఒడిలో భోజనం

వంట కోసం అష్టకష్టాలు పడకుండానే సౌకర్యం

కొత్త టెక్నాలజీతో వండడం సులభం

అలా సరదాగా పిక్నిక్ కు వెళ్లి.. ఆరుబయట ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వేడివేడిగా భోజనం తింటే ఎంత ఆనందంగా ఉంటుంది? చిన్నప్పుడు ఊళ్లలో వంటలకని వెళ్లేవాళ్లు. అక్కడే దొరికే కర్రముక్కలతో వంట పొయ్యి చేసి కుండల మీద వండి భోజనాన్ని సిద్ధం చేసుకునేవారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం. మరేం చేయాలి? ఇదిగో మా దగ్గర జవాబు ఉందంటున్నాయి కంపెనీలు.

క్యాంపింగ్స్, పిక్నిక్స్, లాంగ్‌ డ్రైవ్స్‌ లాంటివి మెమొరీస్‌గా  నిలిచిపోవాలంటే.. అక్కడ పరిసరాలతో పాటు చక్కటి ఆహారం దొరకాలి. లేదంటే ఆరోగ్యం చెడి.. ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఆనందాన్ని మిస్‌ అవుతాం. అందుకే చాలా మంది.. మంచి కుక్‌వేర్‌ని వెంట తీసుకెళ్తుంటారు. చిత్రంలోని కుక్‌వేర్‌ అలాంటిదే. ఈ పరికరాన్ని చేత్తో సులభంగా పట్టుకెళ్లొచ్చు. దీని హ్యాండిల్స్‌ డివైస్‌కి ఇరువైపులా బల్ల మాదిరిగా ఉండి.. స్టోరేజ్‌కి ఉపయోగపడతాయి.

 

గ్స్‌ కూడా ఫోల్డ్‌ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. కిందవైపు సొరుగుల్లో చెక్కముక్కలు లేదా బొగ్గులు వేసుకుని నిప్పు రాజేసుకోవాలి. దానికి ప్రత్యేకమైన డోర్‌ ఉంటుంది. పొగవాసన బయటికి పోవడానికి వెనుకవైపు ప్రత్యేమైన గొట్టాన్ని అమర్చుకోవచ్చు. దీన్ని వేరుచేసి డివైస్‌ లోపల సొరుగులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరంపై అన్ని రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అందుకు తగ్గ పాత్రలను మార్చుకోవచ్చు. లాంగ్‌డ్రైవ్‌లో చక్కగా ఉండటమేగాక హాయిగా ఇంటి భోజనం చేశామన్నా సంతృప్తి దొరకుతుంది కదా!. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరీ.

(చదవండి: ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..)

ఔట్ డోర్ లో సులభంగా వండే 30 వంటలు

మరిన్ని వార్తలు