English Idiom: ఏ  బోల్ట్‌ ఫ్రమ్‌ ది బ్లూ.. ఏ సందర్భంలో వాడతారో తెలుసా?

3 Jun, 2022 13:00 IST|Sakshi

ఏ  బోల్ట్‌ ఫ్రమ్‌ ది బ్లూ

తనకు బుకర్‌ప్రైజ్‌ వచ్చిన సందర్భంగా రచయిత్రి గీతాంజలి శ్రీ తొలి స్పందనగా ఇలా అన్నారు... ఏ బోల్ట్‌ ఫ్రమ్‌ ది బ్లూ! అనుకోని సంఘటన, ఊహించని ఫలితం...మొదలైన సందర్భాలలో ఉపయోగించే ఇడియమ్‌ ఇది.

ఇక దీని మూలాల విషయానికి వస్తే... ప్రశాంతమైన ఆకాశం ఉన్నట్టుండి ఉరుముతుంది. ఎక్కడో పిడుగుపడుతుంది...ఇదంతా ఊహకు అందనిది. మరొకటి ఏమిటంటే... మధ్యయుగాల కాలంలో యుద్ధాలలో ‘క్రాస్‌బో’(అడ్డవిల్లు)ను ఉపయోగించేవారు.

సాధారణ విల్లుతో పోల్చితే ఇందులో నుంచి ప్రయోగించే ‘బోల్ట్‌’ ఎక్కువ దూరం దూసుకువెళుతుంది. టార్గెట్‌పర్సన్‌కు షూటర్‌ కనిపించడు. ఇది ఊహించనిది. ‘బోల్డ్‌ ఫ్రమ్‌ ది బ్లూ’  థామస్‌ కార్లైల్‌ ది ఫ్రెంచ్‌ రెవల్యూషన్‌ (1857) పుస్తకంలో మొదటిసారిగా కనిపిస్తుంది. 

చదవండి: Brain Gym: భర్తను షూట్‌ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం?

మరిన్ని వార్తలు