-

ఎన్విరాన్‌మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే

27 Nov, 2023 11:45 IST|Sakshi
ఫోటో క్రెడిట్స్‌: EPOTY

పర్యావరణ కాలుష్యం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్‌ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్‌ ఆప్‌ ది ఇయర్‌ విజేతలను ప్రకటించారు.

చార్టర్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 159 దేశాల నుంచి ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఆరుగురిని విజేతలుగా ప్రకటించారు. వాళ్లు తీసిన ఫోటోలు ఏంటి అన్నది తెలియాలంటే ఫోటోగ్యాలరీని క్లిక్‌ చేయండి.
 

(ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మరిన్ని వార్తలు