కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తున్నారా? ఆ ఇన్‌ఫెక్షన్‌ మనుషుల్లోనూ..

22 Nov, 2023 13:28 IST|Sakshi

ఈరోజుల్లో కుక్కల్ని పెంచుకోవడం కామన్‌ అయిపోయింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కుక్కలు బెస్ట్‌ స్ట్రెస్‌ బస్టర్‌గానూ ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇంట్లో మనిషిలాగే కుక్కలను కూడా ట్రీట్‌ చేస్తుంటారు. కుటుంబసభ్యులకు చేసినట్లు కుక్కలకు కూడా ఘనంగా బర్త్‌డే పార్టీలు, సీమంతాలు నిర్వహిస్తుంటారు. మరికొందరైతే కుక్కలకి పెట్టకుండా ఏమీ తినరు. అయితే కొన్నిసార్లు అతి ప్రేమతో తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. ఇష్టంగా తింటున్నాయి కదా అని ప్రతిరోజూ వాటికి ఆహారంలో పచ్చి మాంసం పెడుతుంటారు. దీని వల్ల మనుషులకు అనేక ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. 

కుక్కలకు పచ్చిమాంసం పెట్టడం వల్ల యాంటీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు కారణం అవుతుందని తేలింది. యాంటీబయాటిక్స్‌ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు వాడతారు. కానీ మితిమీరి యాంటీబయోటిక్స్‌ను వాడితే శరీరం బాక్టీరియాను నిరోధించే శక్తిని క్రమంగా కోల్పోతుంది.  అయితే కుక్కులకు పచ్చి మాంసం తినిపించడం వల్ల సిప్రోఫ్లోక్సాసిన్ నిరోధక E. కోలిని విసర్జిస్తుందని తాజాగా  యూకేకు చెందిన బ్రిస్టోల్‌ సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది.

సాధారణంగా Fluoroquinolones అనే యాంటిబయోటిక్స్‌ను మనుషులకు, పశువైద్యంలోనూ ఉపయోగిస్తారు. కుక్కలకు పచ్చి మాంసం తినిపించం వల్ల బాక్టీరియా ఏర్పడి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ E. కోలితో కలుషితమవుతుందని శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్‌లో కనుగొన్నారు. సుమారు 600 ఆరోగ్యకరమైన కుక్కలను పరిశీలించగా వాటి నమూనాల్లో మానుషులు, జంతువుల ప్రేగుల్లో E. coli బాక్టీరియా రకాన్ని గుర్తించారు.

ఇది పరిశుభ్రత సరిగా లేని, పచ్చి మాంసం తినడం వల్ల పేరుకుపోయిందని తేలింది. దీనివల్ల యాంటిబయోటిక్స్‌ నిరోధం తగ్గిపోతుందని, ఫలితంగా బాక్టీరియా ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. పచ్చిమాంసాన్ని కుక్కలకు స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది ప్రేగుల్లో కొన్ని సంవత్సరాల పాటు పేరుకుపోయి తర్వాత ట్రీట్‌మెంట్‌ అందివ్వడానికి సైతం కష్టమవుతుంది.

సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో సుమారు 7.3% గ్రామీణ కుక్కలు,  11.8% పట్టణాల్లో కుక్కల మలంలో సిప్రోఫ్లోక్సాసిన్-రెసిస్టెంట్ E. కోలి ఉన్నట్లు గుర్తించారు. వండని మాసం తినిపించడే ఈ బాక్టీరియాకు కారణమని నమూనాల్లో తేలింది. అందుకే కుక్కల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు