వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

15 Nov, 2023 12:30 IST|Sakshi

మనం కొత్తగా ఏదైన డైట్‌ లేదా వ్యాయామాలకు సంబంధించి మార్పులు తీసుకునేటప్పుడూ సమయపాలనే అనేది ముఖ్యం. అంటే.. ఇక్కడ రోజూ ఒకే టైంలోనే ఏదైనా చేయమని నొక్కి చెబుతుంటారు నిపుణులు. మన చిన్నప్పుడూ కూడా ఈ టైం కల్లా చదువుకోవడం పూర్తి చేసుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్లు పదేపదే చెబుతుంటారు. ఇలానే ఎందుకు? ఇది మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది తదితరాల గురించి తాజా అధ్యయనాల్లో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు గల కారణాలకు సరైన సమాధానం కూడా దొరికింది.

మనం చేసే వ్యాయామం లేదా ఏదైన పని రోజూ ఒకే టైంలో చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఈ మేరకు మాంచెస్టర్‌ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో..ఏ వ్యక్తి అయినా వ్యాయామాన్ని ఇష్టారీతిలో తనకు కుదిరిన సమయంలో చేసిన వారి కంటే ఒక నిర్దేశిత టైంలో చేసిన వారిలోనే మెరుగైన పలితాలు కనపడటం గుర్తించారు. దీనికి గల కారణాల గురించి సాగిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానవుని శరీరం బాహ్య వాతావరణంతో ప్రభావితవుతుంది. అందుకు తగ్గట్టుగా మన అంతర్గత శరీరీం స్కిరాడియన్‌ గడియారాన్ని సెట్‌ చేసుకుంటుందట. ఇక్కడ స్కిరాడియన్‌ గడియారం అంటే జీవక్రియ గడియారం. దీని అర్థం ఉదయం మేల్కోనగానే కాసేపు బద్ధకంగా అనిపించటం, తర్వాత ఆకలి.. ఆ తర్వాత రోజూవారి పనుల్లో నిమగ్నమవ్వడం ఒక లయబద్ధంగా మన మెదడు సిగ్నల్స్‌ పాస్‌ చేయడంతో ఆటోమెటిక్‌గా చేసుకుంటూ పోతున్న విధానాన్నే జీవగడియారం అంటారు.

అంటే..ఇక్కడ మన జీవక్రియ గడియారానికి మన శరీర భాగాలకు మధ్య మెదడు అనే సెంట్రల్‌ గడియారం సమన్వయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అందువల్ల సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్‌ నిద్రకు ఉపక్రమించడం, వెలుగు అనగానే బాడీ సెట్‌ రైట్‌ అయిపోయి లేవాలనే ఫీల్‌ కలగడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఏదైనా డైట్‌ లేదా వ్యాయామం చేయాలనుకుంటే..రోజూ ఒక నిర్దేశిత టైంలో చేస్తే రిజల్ట్‌ బాగుండటమే గాక అనారోగ్యాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండగలుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజులో  24 గంటలు అనే రోజు చక్రానికి అనుగుణంగా మన బాడీ ప్రతిస్పందిస్తుంది. అదే శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం, రక్తంలో స్థాయిలు మార్పులు, తదితరాలకు కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు.

మన శరీరంలోని ఇతర భాగాలు గనుక మన జీవ గడియారం, సెంట్రల్‌ గడియారానికి అనుగుణంగా పనిచేయకపోయినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితే మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌కు కారణమని అన్నారు. అలాగే పగటిపూట మాగ్జిమమ్‌ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటాం. అందువల్ల మన వెన్నెముకలోని ఇంటర్‌వర్‌టెబ్రల్ డిస్క్‌ల నుంచి తుంటి, మోకాళ్లలోని మృదులాస్థి నుంచి నీరు బయటకు వచ్చి రోజూ ముగిసే సమయానికి కాస్త పొట్టిగా కనిపిస్తాం.  ఇది రోజు ముగిసే సమయానికి మనల్ని కొంచెం పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అదే రాత్రి విశ్రాంత తీసుకునే సమయంలో నీరు తిరిగి మన బాడీకి వస్తుంది మనం యథావిధిగా కనిపిస్తాం అని చెప్పారు.

అందుకోసం తాము ఎలుకలపై అధ్యయనం చేయగా.. ఈ ఫలితాలను గుర్తించామని అన్నారు. మన డైట్‌కి సంబంధించి లేదా వ్యాయామం వంటివి చేసేటప్పుడూ వీలు కుదరినప్పుడల్లా చేస్తే డీసింక్రోనైజేషన్‌కి గురయ్యి ఫలితం సరిగా ఉండదు. పైగా మన ఇతర వ్యవస్థలపై ప్రభావం ఏర్పడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కాబట్టి మనం రోజూ శారీరక శ్రమకు సంబంధించి(వ్యాయామం తదితర పనులు) ఒకే సమయానికి చేయడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్ని సమన్వయం అయ్యి, గాయాల బారినపడకుండా ఉండటమే గాక వయసు రీత్య వచ్చే కీళ్ల సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు మాంచెస్టర్‌ పరిశోధకులు.

(చదవండి: సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్‌ మాయం!)

మరిన్ని వార్తలు