History Of Education In Telugu: చదువు ఎలా మొదలయ్యింది?

2 Nov, 2023 10:22 IST|Sakshi

నేటి యుగంలో ప్రతి ఒక్కరికీ విద్య అనేది చాలా ముఖ్యం. మనిషి ఆకలితో ఉండగలడు కానీ చదువు లేకుండా ఉండలేడని కొందరు అంటారు. నేటి రోజ్లులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది విద్యే అవుతుంది. ఇప్పుడు మనం అసలు ప్రశ్నలోకి వస్తే ఈ పఠన కళ మనుషులలో ఎలా అభివృద్ధి చెందింది? మనిషిని విద్యలో ముందుకు నడిపించిన విషయం ఏమిటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చదువుకు సంబంధించిన చరిత్ర శతాబ్దాల క్రితం నాటిది. అయితే విద్య విషయంలో సైన్స్ భిన్నమైన వాదనలను వినిపిస్తుంది. బీబీసీ నివేదిక ప్రకారం రీసెర్చ్ స్కాలర్ మరియాన్ వోల్ఫ్ మాట్లాడుతూ, అధ్యయనం అనేది ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కళ. ఎన్ని మద్యం పాత్రలు లేదా గొర్రెలు ఉన్నాయో లెక్కించడం కోసం ఇది మొదలయ్యిందని ఆమె తెలిపారు. వర్ణమాల ఏర్పరిచిన తరువాత దాని సాయంతో మనుషులు ఏదైనా చదవడం ద్వారా సమాచారాన్ని గుర్తుంచుకోవడం, అవగాహన కల్పించుకోవడం మొదలైనవి చేసేవారు. 

చదువులో ఎవరైనా రాణించినప్పుడు వారిని చురుకైనవారని అంటారు. చదువులో వెనుకబడినవారిని మందబుద్ధి గలవారని అభివర్ణిస్తారు. నిజానికి విద్యకు, మనసుకు చాలా దగ్గరి సంబంధం ఉంది. చదవడం లేదా నేర్చుకోవడం అనేది మనసు ద్వారానే జరుగుతుంది. మెదడులో పది బిలియన్లకు మించిన న్యూరాన్లు ఉన్నాయి. వాటి ద్వారా మెదడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంది.  విషయాలను అధ్యయనం చేయడంలో, గుర్తుంచుకోవడంలో ఈ న్యూరాన్లు కీలకంగా వ్యవహరిస్తాయి.
ఇది కూడా చదవండి: ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్‌ ఎలా జరుగుతుంది? 

మరిన్ని వార్తలు