Raksha Bandhan Wishes: రాఖీ పౌర్ణమి సందర్భంగా.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా...

12 Aug, 2022 12:27 IST|Sakshi

అమ్మానాన్నలు మనకు జన్మనివ్వడంతో పాటు మనకు ఇచ్చే మరో గొప్ప వరం తోబుట్టువులు. ఈ ప్రపంచంలోని బంధాల అన్నింటిలోనూ సోదర, సోదరీ బంధం ప్రత్యేకమైనది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం వెలకట్టలేనిది. అంతేకాదు తోడబుట్టకపోయినా కొంతమంది అంతటి ఆప్యాయత, అనుగారాలు పంచే బంధాలు కలిగి ఉండి అదృష్టవంతులు అనిపించుకుంటారు.

ఇలా సహోదర భావంతో మెలుగుతూ.. ‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష’ అంటూ రాఖీ కట్టుకునే పర్వదినం నేడు. మరి ఈ పండుగ రోజు మీ ఆప్తులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి. దూరంగా ఉన్నా సరే నేను నీతోనే ఉన్నా అనే భావనతో మనల్ని దగ్గర చేసేందుకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఇలా ఉపయోగించుకోండి!

సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

మన రహస్యాలు తెలిసిన వాళ్లు మనకు అత్యంత ఆప్తులు. వాళ్లే మన తోబుట్టువులు. రాఖీ పూర్ణిమ అందరిలో సరికొత్త కాంతులు తేవాలి. హ్యాపీ రాఖీ బంధన్

ఈ బంధం పెవికాల్ కంటే పటిష్టమైనది. దీన్ని విడగొట్టడం ఎవరి తరమూ కాదు. ప్రతీ అణువులోనూ నిండిన సోదర, సోదరీ ప్రేమానుబంధం. అందరికీ హ్యాపీ రాఖీ పూర్ణిమ.

డైరెక్టుగా కట్టినా, పోస్ట్ ద్వారా వచ్చినా.. రాఖీ రాఖీయే. దాన్ని పంపే సోదరి తన ప్రేమంతా అందులో కూర్చుతుంది. అలాంటి వారందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు.

రాఖీపూర్ణమ అంటే నాకెంతో ఇష్టం. చేతులకు రాఖీలు, సోదరీమణుల దీవెనలూ ఎప్పటికీ కావాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.

అక్కా, చెల్లీ, అన్నా, తమ్ముడూ.. ఈ పిలుపుల్లో ఉండే తీపి చక్కెర కంటే తియ్యన. తోబుట్టువుల బంధం కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ హ్యాపీ రక్షా బంధన్.

Raksha Bandhan Wishes:

‘అమ్మలోని ‘అ' పదం.. నాన్నలోని ‘నా' పదం కలిపితేనే ‘అన్న'
అన్నైనా.. తమ్ముడైనా నీకు అందివ్వగలిగేది ఆనందమే''
మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ హ్యాపీ రక్షా బంధన్

‘‘గులాబీకి ముళ్లు రక్ష.. చేపకి నీరు రక్ష.. పుట్టిన బిడ్డకు తల్లి రక్ష.. నా అక్క చెల్లెళ్లందరికీ నేను రక్ష''గా ఉంటానని హామీ ఇస్తూ సోదరీమణులందరికీ హ్యాపీ రక్షాబంధన్..

‘‘చిరునవ్వుకు చిరునామా.. మంచి మమతకు మారురూపం... ఆప్యాయతకు నిలువెత్తు రూపమే రక్షాబంధన్'' రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

‘‘నేను ఏమి చేస్తే మంచిగా ఉంటానో.. నా సోదరులకు బాగా తెలుసు.. అందుకే వారు నాతో ఎప్పటికీ ఉంటారు''

‘నాకు ఉన్న సోదరుడు స్నేహితుడి లాంటి వాడు. అలాంటి సోదరుడు ఎవ్వరికీ ఉండరు. అందుకే నేను చాలా లక్కీ అని నమ్ముతాను''

Raksha Bandhan Quotes:

ప్రపంచం మారుతుంది, కాలం గడుస్తుంది. తోబుట్టువుల ప్రేమానురాగాలు మాత్రం స్థిరంగా ఉంటాయి. వాటికి కాలపరిమితి లేదు.

ప్రకృతి ఇచ్చిన స్నేహితుడు సోదరుడు తోబుట్టువుకి తగిన గుర్తింపు తోబుట్టువు వల్లే వస్తుంది. వారి మధ్య బంధం అపరిమితం.

ఒకే రక్త సంబంధం కలిగిన పిల్లలలో ఏర్పడిన అనుబంధం తెలియని శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని మరేదీ ఇవ్వలేదు.

మన సహోదరులు, సోదరీమణులూ మన వ్యక్తిగత కథల్లో తెల్లవారుజాము నుంచి సాయం సంధ్య వరకు మనతో ఉంటారు.

హృదయపూర్వకంగా లభించే బహుమతి సోదరి. తను కట్టే రాఖీ.. మన జీవితానికి అర్థం, పరమార్థం.

నాకు సొంత తోబుట్టువులు లేకపోవచ్చు. నా చేతికి కట్టే ప్రతీ రాఖీలో ఆ అనుబంధాన్ని నేను పొందుతాను.

రాఖీ పౌర్ణమి వేళ ఈ విషెస్, కోట్స్ మీ స్నేహితులు, బంధువులకు పంపుకోండి. 

మరిన్ని వార్తలు