స్నాక్స్‌ కోసం.. మైసూర్‌ బోండాలు, సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు

19 Dec, 2023 15:43 IST|Sakshi

గోధుమ మైసూర్‌ బోండాలు
కావలసినవి:  

గోధుమ పిండి – 400 గ్రాములు
పెరుగు – ముప్పావు కప్పు , బొంబాయి రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు,
బేకింగ్‌ సోడా, పంచదార – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, జీలకర్ర– 1 టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి – 1 టీ స్పూన్‌ (సన్నని తరుగు),
చిన్నచిన్న కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్లు (తురుము కూడా వేసుకోవచ్చు),
కరివేపాకు – 2 రెమ్మలు (సన్నగా తురుముకోవాలి), నూనె – సరిపడా

తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్లో బేకింగ్‌ సోడా, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, బోంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అనంతరం గోధుమ పిండి, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలపాలి. సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుగా, జిగటగా అయ్యేలా చేసుకోవాలి.

దాన్ని రెండు గంటల పాటు నానివ్వాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర,, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరిముక్కలు, కరివేపాకు తురుము వేసుకుని రెండుమూడు నిమిషాలు బాగా కలిపి.. కాగుతున్న నూనెలో కొద్దికొద్దిగా బొండాల్లా వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. 

>
మరిన్ని వార్తలు