Most Visited Cities In The World 2023: ఈ ఏడాది ఎక్కువమంది వెళ్లిన టూరిస్ట్‌ ప్రాంతాలివే..

15 Dec, 2023 13:21 IST|Sakshi

2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్‌ ప్లేస్‌ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్‌ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్‌ స్టోరీ. 

ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్‌ ప్రాంతాలను ట్రావెల్‌ ఏజెన్సీలు రిలీజ్‌ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్‌ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం  2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్‌ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్‌ చూపించారు. అలా టాప్‌ టూరిస్ట్‌ ప్లేస్‌లో  హాంకాంగ్‌ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.

హాంకాంగ్‌
నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు  29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్‌ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్‌ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్‌ పీక్‌, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్‌ పార్క్‌,రిపల్స్‌ బే,లాంటూ ఐస్‌ల్యాండ్‌, స్టార్‌ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్‌ను సందర్శిస్తారని సమాచారం. 

బ్యాంకాక్‌
హాంకాంగ్‌ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్‌. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి  24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్‌ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో  బ్యాంకాక్‌ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్‌ చేస్తుంది. 

లండన్‌
బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ జాబితాలో లండన్‌ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది)  ప్రజలు లండన్‌ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్‌ను విజిట్‌ చేశారు. 

ఆ తర్వాత  ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్‌,చైనా,దుబాయ్‌, ప్యారిస్‌, న్యూయార్క్‌ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు.

>
మరిన్ని వార్తలు