హాట్‌టాపిక్‌గా 'పీరియడ్‌ లీవ్‌'!'మాకొద్దు' అని వ్యతిరేకించటానికి రీజన్‌!

15 Dec, 2023 11:39 IST|Sakshi

ప్రస్తుతం దేశంలో 'పీరియడ్‌ లీవ్‌' గురించే ప్రముఖులు, సెలబ్రెటీలు చర్చిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇది ఒక హాట్‌టాపిక్‌గా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పైగా అందరూ ముక్తకంఠంతో పీరియడ్‌ లీవ్‌ని వ్యతిరేకించడమే ఆసక్తికరంగా మారింది. దీనికి సెలబ్రెటీలు, ప్రముఖులు మద్దతు ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశం. ఎందుకిలా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ "పీరియడ్‌ లీవ్‌" అవసరమా? లేదా ఎందుకు వద్దు..? తదితరాల గురించే ఈ కథనం!.

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు నెలసరి సెలవులు(menstrual leave) ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. ఈ పీరియడ్‌ సెలవు అంశమై నివేదిక కూడా పెట్టారు. ఈ విషయంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను ఆమె గట్టిగా వ్యతిరేకించారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో జరిగే సహజ ప్రక్రియ. అందుల్ల ఈ నెలసరి సెలవులు (menstrual leave ).. పని ప్రదేశంలో వివక్షకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సోమవారం పార్లమెంట్‌లో నివేదక కూడా పెట్టారు. దీంతో బుధవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు మనోజ్ ఝా ఎగువ సభలో రుతుక్రమ పరిశుభ్రత విధానంపై, సెలవులపై ప్రశ్నలు లేవనెత్తడంతో స్మృతి ఈ విధంగా స్పందించారు. ఐతే ఇప్పటి వరకు పిరియడ్‌ సెలవులు తప్పనసరి చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. స్మతీ ఇరానీ మాత్రం ఈ సెలవులను వ్యతిరేకిస్తున్నారు. దీని కోసం పోరాడి కష్టపడి సంపాదించకున్న సమానత్వాన్ని విలువ ఉండదని అన్నారు. అంతేగాదు దీన్ని ప్రత్యేక నిబంధనలు అవసరమయ్యే వికలాంగులు కోణంలో పరిగణించకూడదని చెప్పారు. ఐతే కొద్దిమంది మహిళలు మాత్రమే ఈ టైంలో డిస్మెనోరియా వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని, వీటిని చాలా వరకు మందుల ద్వారా నయంచేసుకోవచ్చని అన్నారు. అలాగే నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు కూడా చెప్పారు.

దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో, 10 నుంచి 19 ఏళ్లలోపు యుక్తవయస్సులో ఉన్న బాలికల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న  'ప్రమోషన్ ఆఫ్ మెన్‌స్ట్రువల్ హైజీన్ మేనేజ్‌మెంట్ (MHM)' పథకం గురించి కూడా ప్రస్తావించారు. అందరూ ఈ పీరియడ్స్‌ని సాధారణ దృక్పథంతో చూస్తే చాలు అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు మంజూరు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. స్మృతి అభిప్రాయంతో పలువురు సెలబ్రెటీ మహిళలు ఏకీభవించి మద్దతు పలకడం విశేషం. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా నయంచేసుకోవచ్చ

మహిళ చేయలేనిది ఏదీ లేదు..!
ప్రముఖ బ్యూటీ బ్రాండ్‌ మామా ఎర్త్‌ సహ వ్యవస్థాపకుడు గజల్‌ అలగ్‌ మాట్లాడుతూ..స్మృతి పీరియడ్‌ లీవ్‌కి బదులుగా మెరుగైన పరిష్కారం సూచించారని ప్రసంసించారు. మహిళలు తాము ఏ పనై అయినా చేయగలమని నిరూపించారు. ఈ ఒక్క కారణంతో వారి సమానాత్వపు హక్కులను కాలరాయకూడదన్న ఆలోచన బాగుందని అన్నారు. అలాగే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సైతం స్మృతికి మద్దతు తెలిపారు. మానవజాతి చరిత్రలో ఒక్క పని కూడా చేయని మహిళ  లేదు.  పిల్లలను పెంచడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అన్నిపనులు చేస్తూనే ఉన్నారు. ఈ పీరియడ్స్‌ అనేది జస్ట్‌ శరీరంలో వచ్చే ఓ నిర్దిష్ట వైద్య పరిస్థితే తప్ప అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు అవసరం లేదంటూ స్మృతి అభిప్రాయంతో ఏకీభవించారు కంగనా. 

సరికొత్త మార్పు..
ఇదంతా చూస్తుంటే మహిళా సాధికారతకు అసైలన అర్థం ఏంటో చెప్పారు. మాకు దయాదాక్షిణ్యాలతో పనిలేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు. సాటి మనుషులుగా ఒకరి బాధను అర్థం చేసుకుంటే చాలు తప్ప మాకదంతా అవసరంలేదని మహిళ ఆత్మివిశ్వాసాన్ని, ఔన్యత్యాన్ని చాటి చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే పురిటినిప్పిని పంటి కింద భరించగలిగే శక్తి ఉన్న స్త్రీకి ఇది ఒక లెక్క కాదు అని తేల్చి చెప్పింది. విమన్‌ పవర్‌ ఏంటో? వారి పంచ్‌ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కదా. ద టీజ్‌ విమెన్‌ అని మరోసారి బల్లగుద్ది చెప్పారు. ఈ పేరుతో మా అవకాశాలను లాక్కొవద్దని, తాము ఎందులోనూ తక్కువ కాదు జస్ట్‌  ప్రకృతి సిద్ధంగా వచ్చే చిన్న ప్రక్రియ అని అందరూ తెలుసుకోండి తామెంటో చూపిస్తామని సగర్వంగా చెబుతున్నారు మహిళామణులు.  

>
మరిన్ని వార్తలు