120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి..

5 Nov, 2021 15:33 IST|Sakshi

సాధారణ బరువున్న వాళ్లు వంద స్కిప్‌లు చేస్తే గుండె దడవచ్చి, అలసిపోతారు. అలాంటిది 120 కేజీల బరువున్న బాలికతో ఆమె తల్లి ఒకరోజు కాదు రెండురోజులు కూడా కాదు ఏకంగా మూడు నెల్లపాటు మూడు వేల స్కిప్‌లు చేయించిందట. దీంతో బాలిక తవ్ర అస్వస్థతకు గురైంది. ఇదంతా ఎందుకు చేసిందంటే..

చైనా మీడియా కథనాల ప్రకారం చైనాలోని జెన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌కి చెందిన ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురు ఎత్తు పెరగాలనే ఉద్ధేశ్యంతో చేసిన పని బాలిక ప్రాణాలకే ప్రమాదం తెచ్చింది. యువాన్‌యువాన్‌ అనే బాలిక ఎత్తు 1.58 మీటర్లు. బరువు 120 కేజీలు. ఎక్సర్‌సైజుల ద్వారా ఆమె బరువును తగ్గించి ఎత్తు పెంచాలని తల్లి నిర్ణయించుకుంది. ఐతే దీని గురించి తల్లి ఏ వైద్యుడిని సంప్రదించలేదు. అందుకు షెడ్యూల్‌ కూడా ఖరారు చేసింది. ప్రారంభంలో రోజుకు వెయ్యి స్కిప్స్‌ చేయించేది. పోనుపోనూ 3 వేల స్కిప్స్‌ రోజూ చేయమని పోరు పెట్టేదట. ఇలా మూడు నెలలపాటు చేసింది. 

చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్‌..

దీంతో బాలిక తరచూ మోకాళ్ల నొప్పి వస్తుందని తల్లికి ఫిర్యాదు చేసేది. ఐతే కూతురు బద్దకంతో ఇలా చెబుతుందని అనుకుందట. బాలికకు మొకాళ్ల నొప్పి తీవ్రతరం కావడంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్‌ ‘ట్రాక్షన్‌ అపొఫిసైటిస్‌’ అనే కీళ్ల సమస్యకు గురైనట్లు తెలిపాడు. అంతేకాకుండా అధిక వ్యాయామం పిల్లలకు హానికరమని, బరువుతగ్గడానికి ఇతర పద్ధతులు కూడా ఉ‍న్నాయని, ఇంతకు ముందు కూడా అధిక వ్యాయామం కారంణంగా పదేళ్ల బాలుడు కాలిచీలమండ నొప్పికి గురైనట్లు వెల్లడించాడు. పిల్లలకు వ్యాయామంతోపాటు సరైన నిద్ర, పోషకాహారం, మానసిక స్థితి వంటి వాటిపై కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ సదరు మహిళకు సూచించాడు.

చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!!

మరిన్ని వార్తలు