నాటి రాత్రి లక్క ఇంటిని కాల్చమని..

18 Nov, 2020 06:53 IST|Sakshi

ప్రశ్నోత్తర భారతం

లక్క ఇల్లు
ప్రశ్న: ఒకనాడు హస్తిన నుంచి ఎవరు వచ్చారు?
సమాధానం: ఒక మనిషి వచ్చాడు. అతడు గనులు తవ్వులయందునేర్పరి

ప్రశ్న: ఆ మనిషిని ఎవరు పంపారు?
సమాధానం: విదురుడు 

ప్రశ్న: ఆ మనిషి ఏం చేశాడు?
సమాధానం:  పాండవులను రహస్యంగా కలుసుకున్నాడు

ప్రశ్న: ధర్మరాజుతో ఏమన్నాడు?
సమాధానం: నేను విదురుడు పంపగా వచ్చాను. అతడు మీ క్షేమం కోరి నన్ను ఇక్కడకు పంపాడు

ప్రశ్న: లక్క ఇంటి గురించి ఏమని వివరించాడు?
సమాధానం:  కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి లక్క ఇంటిని కాల్చమని పురోచనుడు అన్నాడు. ఈ ఇంటి నుండి మిమ్మల్ని తప్పించమని విదురుడు నన్ను ఆజ్ఞాపించాడు. అందుకు నేను ఒక బిలం తవ్వాను. దాని ద్వారా మీరు బయటకు వెళ్లవచ్చు అన్నాడు.

ప్రశ్న:  అతడి మాటలు విన్న భీముడు ఏం చేశాడు?
సమాధానం: భీముడు బిలం పరిశీలించి చూశాడు. అపాయం లేదని గ్రహించాడు. తమకేమీ తెలియనట్లు ఉన్నాడు

ప్రశ్న:  పురోచనుడు ఎవరిని వివాహమాడాడు?
సమాధానం: నిషాద స్త్రీని

ప్రశ్న: పురోచనుడికి ఎంతమంది కొడుకులు?
సమాధానం:  ఐదుగురు
–నిర్వహణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు