Chepala Iguru In Telugu: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా!

25 May, 2022 13:19 IST|Sakshi

నోరూరించే చేపల ఇగురు ఇలా సులువుగా తయారు చేసుకోండి. 

చేపల ఇగురు తయారీకి కావలసినవి:
►పచ్చి చిన్న చేపలు – కేజీ
►కారం – మూడు టీస్పూన్లు
►కరివేపాకు – రెండు రెమ్మలు
►అల్లం – రెండు అంగుళాల ముక్క
►పుల్లటి పచ్చి మామిడి కాయ – ఒకటి
►పచ్చికొబ్బరి తురుము – కప్పు
►పసుపు – చిటికెడు
►పచ్చిమిర్చి – నాలుగు
►ఉప్పు – రుచికి సరిపడా.
►గార్నిష్‌ కోసం:  ఆవాలు – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – రెమ్మ, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ విధానం..
►మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి
►చేపలను శుభ్రం చేసి నీచు వాసనలేకుండా ఐదారుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి
►అల్లంని తొక్కతీసి పేస్టుచేయాలి
►పచ్చికొబ్బరి తురుములో పసుపువేసి మెత్తగా రుబ్బుకోవాలి
►బాణలిలో మామిడికాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కప్పు నీళ్లుపోసి ఉడికించాలి ∙
►మామిడికాయ ముక్కలు ఉడికిన తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను వేయాలి
►చేపలు ఉడికిన తరువాత కొబ్బరి పేస్టు వేసి మరో 10 నిమిషాలు ఉడికించి దించేయాలి
►ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్‌ వేసి వేడెక్కనివ్వాలి, ఆయిల్‌ వేడెక్కిన తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి
►ఉల్లిపాయలు బ్రౌన్‌ రంగులోకి మారాక తాలింపుని ఉడికిన చేపల కూరలో వేసి కలుపుకుంటే చేపల ఇగురు రెడీ.

చదవండి👇
Egg Chapati Recipe In Telugu: ఘుమఘుమలాడే ఎగ్‌ చపాతీ తయారీ ఇలా!
Recipe: నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి!
Anapa Ginjala Charu: పాలకూర.. పచ్చిమామిడి ముక్కలతో రుచికరమైన అనపగింజల చారు!

మరిన్ని వార్తలు