సాయంత్రం టీలోకి బెస్ట్‌ ఆప్షన్‌.. మక్‌ పారా ఫ్లవర్స్‌

9 Nov, 2023 14:55 IST|Sakshi

మక్‌ పారా ఫ్లవర్స్‌ తయారికి కావల్సినవి:

మైదా– 2 కప్పులు, పంచదార పొడి– అర కప్పు,
మిరియాల పొడి– అర టీస్పూన్‌, ఉప్పు– కొద్దిగా
నూనె– 3 టేబుల్‌ స్పూన్లు,చిక్కటి పాలు– సరిపడా (కాచి చల్లారిన వి)
నూనె– డీప్‌ ఫైకి సరిపడా, లవంగమొగ్గలు– కొన్ని(అభిరుచిని బట్టి)

తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మైదాపిండి, మిరియాలపొడి, పంచదార పొడి, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దల్లా చేసుకుని.. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం నచిన విధంగా ఫ్లవర్‌లా చేసుకోవచు. లేదా అభిరుచిని బట్టి ఒక ఫ్లవర్‌పై మరో ఫ్లవర్‌ ఉంచి, మధ్యలో ఒక్కో లవంగమొగ్గ గుచ్చి, కదలకుండా పెట్టుకోవచ్చు. అనంతరం వాటిని నూనెలో డీప్‌ ఫై చేసుకుంటే సరిపోతుంది.
 

మరిన్ని వార్తలు