ఆయన క్యాచ్‌ జారవిడిస్తే.. నాకు తిట్లు పడేవి: నటి

17 Apr, 2021 10:44 IST|Sakshi

క్రికెటర్లు పెళ్లి చేసుకుని భార్యలతో టోర్నమెంట్లకు వస్తే, వచ్చాక సరిగా ఆడకపోతే ఆ భార్యలను ట్రోల్‌ చేసే అభిమానులు ఉన్నారు. విరాట్‌ కోహ్లి విఫలమైనప్పుడల్లా అనుష్క శర్మ ఈ విషయంలో బాగా ఇబ్బంది పడ్డారు. అయితే అనుష్కా మాత్రమే కాదని... తాను కూడా పటౌడి సరిగ్గా ఆడకపోతే తిట్లు తిన్నానని షర్మిలా టాగోర్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘పటౌడి గారు మా పెళ్లి సమయానికి ఇంకా ఆడుతున్నారు. ఆయన బరిలో దిగితే బాగా ఆడతారని పేరు. కాని మా పెళ్లయ్యాక  ఆయన క్యాచ్‌ జార విడిచినా, సరిగ్గా బ్యాటింగ్‌ చేయకపోయినా నాకు తిట్లు పడేవి. అయితే అభిమానుల నుంచి కాదు. మా నాన్న నుంచే.

ఆయన కామెంటరీ వింటూ ‘‘అరె... నువ్వతన్ని రాత్రి సరిగ్గా నిద్ర పోనిచ్చావా లేదా’ అని నా మీద కయ్యిమనేవారు’ అని తిట్టేవారు’’ అని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. షర్మిలా టాగోర్, పటౌడీలకు సైఫ్‌ అలీ కాకుండా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోహా అలీ ఖాన్, సాబా అలీ ఖాన్‌. అయితే వీరెవరికీ ఆమె ఇతర హీరోలతో కలిసి నటించిన సినిమాలు చూడటం ఇష్టం లేదు. చూడరు కూడా. సాబా అలీ ఖాన్‌ మాత్రం ‘నువ్వు నటించిన చుప్కే చుప్కే మాత్రం నాకు చాలా ఇష్టం’ అంటూ ఉంటుంది. పిల్లలు ముంబైలో ఉంటున్నా షర్మిలా ఢిల్లీలో నివసిస్తుంటారు.

చదవండి: ఇక నుంచి మా అమ్మ సలహా తర్వతే సైన్‌
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు