Kova Banana Halwa: నోరూరించే కోవా బనానా హల్వా తయారీ ఇలా!

27 Feb, 2022 16:08 IST|Sakshi

మీకు స్వీట్లంటే ఇష్టమా? హల్వా అంటే మరీ ఇష్టమా? ఎప్పుడూ ఒకేలాంటి హల్వా తిని బోర్‌ కొడితే.. ఈ కోవా బనానా హల్వాను ట్రై చేయండి. ఎంచక్కా లొట్టసేకుంటూ లాగించేయండి.

కోవా బనానా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
కోవా – అర కప్పు
అరటిపండ్లు – 3 (తొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి)
బాదం గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌
పంచదార – అర కప్పు
నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్లు
డ్రైఫ్రూట్స్‌ ముక్కలు – కొన్ని

తయారీ:
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి వేడికానివ్వాలి.
ఇందులో అరటిపండు గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి.
తర్వాత పంచదార వేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి.
కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
ఆ మిశ్రమాన్ని మొత్తం నెయ్యి పూసిన బౌల్లోకి తీసుకుని చల్లారనిచ్చి, గట్టిపడిన తర్వాత సర్వ్‌ చేసుకోవాలి.
డ్రైఫ్రూట్స్‌ ముక్కల్ని హల్వా చేస్తున్నప్పుడు లేదా పూర్తి అయిన తర్వాత జోడించుకోవచ్చు. 

చదవండి: అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా?

మరిన్ని వార్తలు