అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి! అస్సలు వదిలిపెట్టరు..

24 Sep, 2023 09:45 IST|Sakshi

కావలసినవి:  
అరటికాయలు – 2 (మీడియం సైజువి, ముందుగా ఉడికించి, తొక్క తీసి, చల్లారాక మధ్యలో గింజల భాగం తొలగించి, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)
అటుకులు – అర కప్పు (కొన్ని నీళ్లల్లో నానబెట్టి, పేస్ట్‌లా చేసుకోవాలి), కొత్తిమీర తరుగు – కొద్దిగా
జొన్నపిండి – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్‌
జీడిపప్పులు – 10 (నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి)
చాట్‌ మసాలా  – అర టీ స్పూన్, 
కారం – అర టీ స్పూన్‌
పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి)
నూనె – సరిపడా. ఉప్పు – తగినంత

తయారీ:
ముందుగా అరటికాయ గుజ్జు, అటుకుల పేస్ట్‌ వేసుకుని దానిలో కారం, చాట్‌ మసాలా, జొన్నపిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇతర కూరగాయల తురుము వంటివి కలుపుకోవచ్చు. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి ఫింగర్స్‌లా, పొడవుగా చిత్రంలో ఉన్న విధంగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

(చ‌ద‌వండి: దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే! )

మరిన్ని వార్తలు