అభివృద్ధికి కీలకం... వికేంద్రీకరణ

12 Dec, 2023 08:20 IST|Sakshi

ఏ రాష్ట్రమైనా సుసంపన్నం కావాలంటే పంచాయతీ రాజ్‌ వ్యవ స్థను పటిష్ఠపరచాలి. మొత్తంగా దేశం అభివృద్ధి పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలంపైనా, అది ఏ మేర పాలనను వికేంద్రీకరిస్తుంది అన్న అంశాల పైనా ఆధారపడి ఉంటుంది. స్వర్గీయ రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని ప్రాథమిక స్థాయి సంస్థలకు అధికారాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో గుర్తించారు. స్థానిక సంస్థలకు అధికారాలు పంచడం కోసం రాజ్యాంగ సవరణకు సైతం వెనుకాడలేదు.

ఫలితంగా 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త పంచాయతీరాజ్‌ వ్యవస్థ రూపు దిద్దుకొంది. ఈ వ్యవస్థే గత 30 ఏళ్లుగా కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చింది.కేరళ వంటి రాష్ట్రాల సామా జిక, ఆర్థిక అభివృద్ధికి అక్కడి చైతన్య వంతమైన పంచాయతీ వ్యవస్థ ముఖ్య కారణం.

గ్రామ పంచాయతీ స్థాయిలోనే పాలన సమర్థంగా అందడం, మరికొన్ని ఇతర అంశాలు దీనికి కారణం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్థల బలోపేతం, పాలన వికేంద్రీకరణ అంశాల్లో ముందు వరుసలోనే ఉన్నాయి.పరిమితమైన వనరులను దృష్టిలో పెట్టుకుంటే గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు.

ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి పంచాయతీలకు అందే నిధులు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ఈ నిధులు తలసరి లెక్కలో విడుదల అవుతూంటాయి. పోనీ పంచాయతీలు సొంతంగా ఏవైనా వినూత్నమైన ఆదాయ వనరులను సమకూర్చుకోగలవా? ఇది కూడా వీలు కాని విషయమే. ఇలా చేసుకోగలిగితే ఆ గ్రామపంచాయతీ చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క.

కేరళలో కొన్ని గ్రామ పంచాయతీలు వినూత్నమైన పద్ధతుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూండటం ఇక్కడ చెప్పుకోవా ల్సిన విషయం. 2030 నాటికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవు తుంది. ఆర్థిక సహకారం, పాలన పరంగా స్వాతంత్య్రం కూడా అవసరమవుతాయి.

వీటితోపాటు గ్రామ పంచాయతీల స్థాయిలో సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో సమర్థమైన, వికేంద్రీకృతమైన పరిపాలన సాగేందుకు కింది సూచనలను కూడా పరిగ ణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల మానవ వనరుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ‘2022 నేషనల్‌ కెపాసిటీ బిల్డింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌’ ఇచ్చిన సలహా సూచనల సాయంతో  పనులు చేపట్టాలి.

ప్రణా ళిక రూపకల్పన, అమలులో గ్రామపంచాయతీల్లోని ప్రజలందరూ భాగ స్వాములయ్యేలా చూడాలి. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయ తీలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చాలి. దాతృత్వసంస్థల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు సమ కూరేలా వ్యస్థలను ఏర్పాటు చేయాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించగలవని నా విశ్వాసం. – డా.డబ్ల్యూ. రాంపుల్లా రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ఎన్‌ఐఆర్‌డీ మాజీ డైరెక్టర్‌ జనరల్‌

>
మరిన్ని వార్తలు