శాసనసభ తీర్మానంతో దళిత క్రైస్తవుల్లో జోష్‌

25 Mar, 2023 02:06 IST|Sakshi
దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి

తెనాలి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శుక్రవారం చేసిన కీలక తీర్మానాల్లో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. దళిత క్రైస్తవులు మతం మారినంత మాత్రాన, వారి జీవన స్థితిగతుల్లో మార్పు లేదని, వారిని ఎస్సీలతో సమానంగా పరిగణించి, తగు రాయితీలను కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. దేశవ్యాప్తంగా గల దళిత క్రైస్తవ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. వారి జీవనక్రమంలో మార్పులు సంక్రమించి, దళిత కుటుంబాల్లో సమానత్వం కలుగుతుందనీ, శాంతి పరిఢవిల్లుతుందన్నారు. సమసమాజ నిర్మాణంలో ఎస్సీ క్రైస్తవులంతా సామాజిక భాగస్వామ్యం వహిస్తారని తెలిపారు. శాసనసభలో తీర్మానంతో ఒక నూతన వ్యవస్థకు తెరతీసినందుకు, దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు కొత్త వెలుగు చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు