రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి

25 Mar, 2023 02:06 IST|Sakshi

పట్నంబజారు: రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా అనుబంధ విభాగాలు పాటుపడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు. ఈమేరకు కృష్ణనగర్‌లోని ఆయన కార్యాలయంలో శుక్రవా రం జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ డొక్కా మా ణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ ఏరాజకీయ పార్టీ అయినా అనుబంధ విభాగాలు ఎంతో కీలకమని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ముఖ్య బాధ్యత వారిపై ఉందన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంవత్సరం సమ యం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ప్రణాళికా బద్ధంగా పార్టీకి మరింత బలోపేతం చేసేందుకు ముందుకు సాగాలన్నారు. దాని లో భాగంగా ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అనుబంధ విభాగాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 5న భారత దేశ పరిపాలన రంగంలో బాబు జగజ్జీవన్‌రావ్‌ పాత్ర, 6వ తేదీన జగనన్న పాలన– రైతు సంక్షేమం, 7న జగనన్న పాలనలో విద్యా విప్లవం, 8న లా నేస్తం – పరిపాలన న్యాయ సంస్కరణలు, 9న జగన న్న పాలనలో వైద్య సంస్కరణలు, 10న గ్రామ పరిపాలన సంస్కరణలు, 11న జగనన్న పాలన, బీసీ సంక్షేమం, 12న జగనన్న పాలనలో యువత సాధికారిత, 13న జగనన్న పాలనలో మహిళ సాధికారిత పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పది రోజుల పాటు జరిగే కార్యక్రమాలు బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు సమావేశాలు జరుగతాయని వివరించారు. సమావేశంలో జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సీడీ భగవాన్‌, మాదారాధా, కళ్లం హరికృష్ణారెడ్డి, డాక్టర్‌ వై.షేక్‌, ఆవుల సుందరరెడ్డి, అల్లాబక్షు, మునగాల మల్లేశ్వరరావు, మేడా వెంకటేశ్వరరావు, ఎన్‌.ప్రభాకర్‌, సి.హెచ్‌.సాంబశివరావు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌

మరిన్ని వార్తలు