అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే జరిమానా

28 Mar, 2023 01:20 IST|Sakshi
అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి

గుంటూరు వెస్ట్‌: ఏపీ సేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందే అర్జీలను అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు పొందడం ప్రజల హక్కు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. కొందరు ఫిర్యాదుదారులు స్వప్రయోజనాల కోసం తప్పుడు అర్జీలు ఇస్తూ అధికారుల సమయాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఉపేక్షించమని హెచ్చరించారు. కోర్టు కేసులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మొత్తం వచ్చిన 145 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ వెంకట శివరామిరెడ్డి పరిశీలించారు. కొన్ని ఫిర్యాదులు..

కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి స్పందనలో అర్జీల స్వీకరణ

మరిన్ని వార్తలు