రంగంలోకి నూరుద్దీన్‌..

14 Oct, 2023 07:33 IST|Sakshi

పాత బస్తీని శాసిస్తున్న ఎంఐఎం పార్టీ కొత్త తరం నుంచి ఒకరిని ఈసారి రంగంలో దింపనున్నట్లు తెలుస్తోంది. ఒవైసీల కుటుంబంలో నాలుగోతరం రాజకీయ వారసునిగా అక్బరుద్దీన్‌ తనయుడు డాక్టర్‌ నూరుద్దీన్‌ ఒవైసీని చార్మినార్‌ నియోజకవర్గం నుంచి బరిలో దింపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎంఐఎం పార్టీని అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ స్థాపించగా, తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్‌ ఒవైసీ, అనంతరం ఆయన కుమారులు అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌లు రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. నూరుద్దీన్‌ రాజకీయాల్లోకి వస్తే నాలుగో తరానికి ప్రాతినిధ్యం వహించే అవకాశముంది.

మరిన్ని వార్తలు