డ్రీమ్‌ సిటీ..

15 Nov, 2023 07:21 IST|Sakshi

హైదరాబాద్: ఓ వైపు టెక్‌ హబ్‌గా పేరు సాధించే దిశగా దూసుకుపోతున్నా ఇతర నేరాలతో పాటుగా సిటీలో సైబర్‌ క్రైమ్‌ గురించి వింటుంటే ఎంతో గగుర్పాటు, ఆందోళన కలుగుతోంది. దీన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టి సైబర్‌ సిటీ మంచి రిజల్ట్స్‌ సాధిస్తే అది దేశంలోనే నగరానికి ప్రత్యేకతను తీసుకొస్తుంది. అలాగే సోషల్‌ మీడియా వేధింపులు కూడా పెచ్చుమీరాయి.

వ్యక్తుల పేరు ప్రతిష్టల్ని దిగజార్చేందుకు, వ్యక్తిత్వ హననం చేసేందుకు ఇదొక సులభమైన మార్గంగా మారింది. తరచుగా సెలబ్రిటీలు, యువత, మహిళలు బాధితులవుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ తదితర సాంకేతిక సాధనాలు కూడా ఎలా దుర్వినియోగం అవుతున్నాయో, సెలబ్రిటీలను ఎలా వేధిస్తున్నాయో చూస్తున్నాం.

హైదరాబాద్‌ లాంటి మహా నగరాల్లో నివసించేటప్పుడు అన్ని రకాలుగా భధ్రత లభిస్తుందని విశ్వసిస్తాం. ఆ విశ్వాసం నిలబడితేనే సిటీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కలల నగరం అంటే కలల సాకారానికి అడ్డంకుల్లేని నగరం అని కూడా కదా... –సురేఖావాణి, సినీనటి

మరిన్ని వార్తలు