మాల్దీవుల్లో ఘోరం

11 Nov, 2022 05:19 IST|Sakshi

మాలె: మాల్దీవుల రాజధాని మాలెలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు సహా మొత్తం 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. నిరుఫెహి ప్రాంతంలోని విదేశీ పనివారు నివసించే ఇరుకైన భవనంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతుల్లో 9 మంది భారతీయులు కాగా, మరొకరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్యారేజీలో మంటలు మొదలై కార్మికులున్న మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ప్రతి కార్మికుడి బెడ్‌ పక్కన ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఉంది. ఫ్లోర్‌ అంతటికీ కలిపి కేవలం ఒకటే కిటికీ ఉంది. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు