వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వృద్ధురాలు... ఆశ్చర్యపోతున్న​ వైద్యులు

8 Sep, 2022 21:06 IST|Sakshi

ఒక వృద్ధురాలు కేవలం వాసనతోనే వ్యాధిని గుర్తించేస్తోంది. ఆమె ముక్కు అలాంటి ఇలాంటి వ్యాధిని కాదు అరుదైన పార్కిన్‌సన్‌ వ్యాధిని గుర్తిస్తోంది. ఈ వ్యాధి దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి తీవ్రతను బట్టి శరీరంలోని మొత్తం ప్రధాన వ్యవస్థను నియంత్రించేస్తుంది. ఈ వ్యాధి కారణంగా వణుకుతూ ధృఢంగా లేకుండా ఉంటారు. క్రమంగా కదలిక మందగించడమే కాకుండా నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి 500 మందిలో ఒకరు ఈ వ్యాధి భారినపడతారు. అంతేకాదు పార్కిన్సన్స్‌ వ్యాధికి మందు లేదు.

స్కాట్‌లాండ్‌కి చెందిన జాయ్‌మిల్నే అనే 72 ఏళ్ల వృద్ధురాలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఆమె ముక్కుకి  ఒక విలక్షణమైన లక్షణ ఉంది. ఆమె వాసన ద్వారా పార్కిన్సన్‌​ వ్యాధిని పసిగట్టేస్తుంది. దీన్ని మొదటసారిగా తన భర్తలో గుర్తించింది. తన భర్తకు 45 ఏళ్ల వయసులో  పార్కిన్సన్‌ వ్యాధి భారిన పడతారని చెప్పేసింది. అంటే ఆమె 12 ఏళ్లకు ముందే నాడిసంబంధిత వ్యాధితో బాదపడుతున్నాడని నిర్థారించగలిగింది. తన భర్తకు 33 ఏళ్లు వచ్చేటప్పటికి తన భర్త శరీరం నుంచి ఒక విధమైన వాసన వచ్చేదని అప్పుడే తాను ఈ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వివరించింది.

ఆమెకు శరీర వాసనలో వింత మార్పును పసిగట్టగల సామర్థ్యం కలిగి ఉంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమె సాయంతో ఈ విషయాన్ని అధ్యయనం చేసే పనిలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తలు ఆమె సాయంతో పార్కిన్సన్‌తో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించే విధానాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు. 

(చదవండి: హౌస్‌కీపర్‌ని పెళ్లి చేసుకున్న డాక్టర్‌)

మరిన్ని వార్తలు