బీరు తాగిన తల్లి, మరణించిన పసికందు

31 Jul, 2020 10:22 IST|Sakshi

మేరీల్యాండ్‌: ఒక  మహిళ బీర్‌ తాగి తన పాప పక్కన పడుకుంది. ఆమెకు పసికందుతో పాటు 4 యేళ్ల కూతురు కూడా ఉంది. తాగి వచ్చిన ఆ మహిళ  పసిపాపకు పాలుపట్టింది, డైపర్‌ మార్చింది, తలుపులు అన్ని లాక్‌ చేసి జాగ్రత్తగానే పడుకుంది. కానీ తెల్లారి లేచేసరికి ఆ పసికందు కదలడం లేదు. ఆమె పెదాలన్ని నీలం రంగులోకి మారిపోయి కదలకుండా బెడ్‌ మీద ఉంది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు పాప మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన  మేరీ ల్యాండ్‌లో జరిగింది. 

మేరీ ల్యాండ్‌కు చెందిన మురియెల్ మోరిసన్ అనే మహిళ వర్చువల్‌ పార్టీలో 2 బీర్‌లు, కొంచెం మద్యం సేవించింది. తరువాత వెళ్లి తన నాలుగేళ్ల  చిన్నారితో పాటు నిదురిస్తున్న మరో పాప వద్ద పడుకుంది. అయితే బీర్‌ వాసన వలన ఆ పసికందు మరణించిందని, ఆ తల్లి మద్యం సేవించడం కారణంగా పాపకు ఊపిరాడక మృతి చెందినట్లు ఆమె పై కేసు నమోదయ్యింది.

అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం తల్లి నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందనడానికి ఏం ఆధారాలు లేవని పేర్కొంది. అంతే కాకుండా బీర్‌ వాసన వల్ల ఊపిరాడక మరణిస్తారు అని ఎక్కడ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో మోరిసన్‌ను విడుదల  చేశారు. అమెరికాలో ఈ ఒక్కటే కాదు ప్రతి యేడాది కలిసి పడుకోవడం వలన 3,500 మందికి పైగా చిన్నారులు మరణిస్తున్నారు. చిన్నారులతో కలిసి పడుకోవడం కాకుండా వారికి వేరే  ఊయల లేదా బెడ్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా ఆరోగ్య భద్రత నిపుణులు సూచిస్తున్నారు. కానీ 64 శాతం మందికి పైగా మహిళలు వారి పిల్లలతో కలిసి ఒకే బెడ్‌ పై నిదురిస్తున్నారు. చదవండి: ఈత‌క‌ని వ‌చ్చి గుహ‌లో చిక్కుకుపోయాడు

మరిన్ని వార్తలు