Viral Video: జాత్యాహంకారాన్ని రూపు మాపే సరికొత్త సైన్స్‌ సిద్ధాంతం

27 Sep, 2021 20:54 IST|Sakshi

అమెరికాలో జాత్యాహంకారం ఎంతలా కోరలు చాచుకుందో మనకు తెలిసిందే. అంతేకాదు ఎంతో మంది ప్రముఖులు ఈ జాత్యాహంకార కోరల్లో చిక్కుకుని నిరాదారణకు గురైనవారు కోకొల్లలు. నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ నుంచి నేటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వరకు అందరూ ఈ సమస్యతో పోరాడినవారే. అయినప్పటికీ ఇంకా అమెరికాలో అక్కడక్కడ నిగురుగప్పిన నిప్పులా జాత్యాహంకారం రగులుతూనే ఉంది. కానీ వీటన్నింటిని కూకటివేళ్లతో సహా పెకలించేసేలా ప్రఖ్యాత అమెరికన్‌ శాస్త్రవేత్త బిల్‌ నై తన సరికొత్త సైన్స్‌ సిద్ధాంతాలను వివరించారు. 

(చదవండి:  సీఎస్‌కే జెర్సీ వేసుకుంటానంటే నా భార్య ఊరుకోలేదు..!)

ఈ భూమి మీద నివశించే మనుషుల రంగు అందరిదీ ఒకేలా ఎందుకు ఉండదో ప్రపంచ పటం సాయంతో చాలా చక్కగా వివరించారు. అంతేకాదు సూర్యుని ఉష్ణోగ్రత భూమధ్య రేఖ వద్ద అధికమని , ధృవాల వద్ద ఉష్ణోగ్రత తక్కువుగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మనుషులంతా ఆఫ్రికన్‌ సంతతే అని అన్నారు. మానవ సంచారం కారణంగానే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నామని, పైగా అక్కడ ఉన్న కొత్త వాతావరణానికి తగ్గట్టుగా మన శరీర రంగు మారిందని వెల్లడించారు. అందువల్లే  మనుషుల అందరీ రంగు ఒకేలా లేదని స్పష్టం చేశారు. 

ఈ మేరకు ప్రపంచ పటంలోని ఆయా దేశాల రంగుల ద్వారా సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కొన్ని ప్రదేశాలపై  ఎంతగా ప్రసరిస్తాయో కూడా వివరించారు. అయితే అతినీలోహిత కిరణాల మార్పును బట్టే  చర్మం రంగు కూడా మారుతుంటుందని చెప్పారు. దీనికీ తగిన విధంగా శరీరం విటమిన్‌ డి , ఫోల్లేట్‌ విటమిన్‌లు విచ్ఛిన్నం కాకుండా సమతుల్యం చేసుకుంటుందని చెప్పారు. మనందరం ఒకటేనని కానీ మనం శరీరం రంగుతో మనల్ని మనమే వేరుచేసుకుంటూ... సమస్యలు సృష్టించుకుంటున్నాం అని ఒక సరికొత్త సైన్స్‌ సిద్ధాంతాన్ని వివరించారు.  

ఈ మేరకు అమెరికన్ ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్రొఫెషనల్ రెక్స్ చాప్‌మన్ ఈ వీడియో తోపాటు "బిల్‌ నైల్‌ సరికొత్త సిద్ధాంతంతో జాత్యాహంకారాన్ని పూర్తిగా తుడిచి పెట్టేశారు" అనే ట్యాగ్‌ లైన్‌తో  ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఒకరేమో భూమిపై ఉన్న "ప్రతి ఒక్క వ్యక్తి హోమోసేపియన్స్( అందరూ ఒకే జాతి). "  అని మరొకరేమో జన్యుపరంగా మనమంతా ఒకటే అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. అంతేకాదు మిలియన్స్‌లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్‌ వేయండి.

(చదవండి: వాషింగ్టన్‌ రహస్య భూగర్భ రైలు మార్గం)

>
మరిన్ని వార్తలు