ఓ తల్లి గుండెకోత: ‘బిడ్డలను పోలిన బొమ్మలు’

15 May, 2021 15:04 IST|Sakshi

బిడ్డల మీద ప్రేమతో వర్జీనియా మహిళ వినూత్న ప్రయోగం

వాషింగ్టన్‌: ఈ మధ్య కాలంలో మన దేశంలో రెండు మూడు సంఘటనలు జనాలను బాగా కదిలించాయి. అవేంటంటే బెంగళూరుకు చెందిన ఓ కోటీశ్వరుడు చనిపోయిన భార్యను పోలిన విగ్రహం తయారు చేయించి.. దానితో గృహప్రవేశం చేశాడు. తమిళనాడులో కొందరు అక్కాచెళ్లల్లు చనిపోయిన తండ్రి విగ్రహం చేయించి.. దాని సమక్షంలో సోదరి వివాహం జరిపించారు. 

ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే ఓ తల్లి కూడా ఇలానే తన బిడ్డలను పోలిన బొమ్మలను చేయించి.. వాటితో కాలం గడుపుతుంది. ఎందుకు ఇలా అంటే భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు కూడా తండ్రి వద్దనే ఉంటున్నారు. ఆ బాధ నుంచి బయటపడటం కోసం ఆ తల్లి ఇలా లక్షలు ఖర్చు చేసి బిడ్డల బొమ్మలు తయారు చేయించుకుని వాటితో సంతృప్తి పడుతుంది. ఆ వివరాలు.. 

వర్జీనియా క్లిఫాన్‌కు చెందిన లిజ్‌ వాట్సాన్‌ 2010లో భర్తనుంచి విడిపోయింది. అప్పటికే వారికి ముగ్గురు పిల్లలు. ఆఖరి సంతానం వయసు 18 నెలలు కాగా మిగతా ఇద్దరు పిల్లు కొంచెం పెద్దవారు. తల్లితో వచ్చిన కొద్ది రోజుల తర్వాత పెద్దపిల్లలు ఇద్దరు తండ్రి దగ్గరకు వెళ్లిపోయారు. ఆ బాధనుంచి కోలుకోవాడినికి ఆమె దాదాపు 5 ఏళ్లు పట్టింది.

ఈ క్రమంలో ఓ సారి ఆమె యూట్యూబ్‌లో అచ్చు మనిషిని పోలినట్లుండే బొమ్మలను చూసింది. వాటిని చూడగానే వాట్సన్‌కు ఓ ఆలోచన వచ్చినంది. వెంటనే తన పిల్లల ఫోటోలు ఇచ్చి.. వారిలాంటి బొమ్మలు తయారు చేయించింది. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు పెట్టింది. అలా 2016 నుంచి వాట్సాన్‌ రీబోర్న్‌ బేబీ డాల్స్‌ లోకంలో అడుగుపెట్టింది.ప్రస్తుతం ఆమె దగ్గర మొత్తం తొమ్మిది బొమ్మలున్నాయి.

దీనిపై వాట్సాన్‌ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.‘‘నా బిడ్డలు నాన్న కావాలంటూ నా దగ్గర నుంచి వెళ్లిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో మాటల్లో వర్ణించలేను. పిల్లలు వెళ్లిపోయాక నాకు ఎలా అనిపించింది అంటే అన్నాళ్లు వాళ్లని పెంచి ఎవరికో దత్తత ఇచ్చినట్లనిపించింది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఇలా నా బిడ్డలను పోలిన బొమ్మలు తయారు చేయించాను. ఎందుకంటే వీటికి మాటల రావు.. పెరగవు. మరి ముఖ్యంగా ఎన్నటికి నన్ను విడిచిపెట్టి వెళ్లవు’’ అన్నది. 

చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..

మరిన్ని వార్తలు