ఆ ఆదాయం మొత్తం ఇచ్చేస్తా: ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన

22 Nov, 2023 11:00 IST|Sakshi

ఇజ్రాయెల్-హమాస్ వార్‌ నేపథ్యంలో టెస్లా అధినేత ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలాన్‌ మస్క్‌ కీలక విషయాన్ని ప్రకటించారు.  యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.  

ఈ మేరకు మస్క్‌ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, గాజాను పాలించే హమాస్ మధ్య భీకర పోరుకు నాలుగు రోజుల తాత్కాలిక విరామం ప్రకటన తరువాత మస్క్‌   సాయం ప్రకటన వచ్చింది.  గత నెలలో, ఎలాన్‌ మస్క్ గాజాలోని గుర్తింపు పొందిన సహాయ సంస్థలకు కనెక్టివిటీని అందించనున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీకర యుద్ధం మొదలైంది. ఈ యుద్దానికి నిన్నటికి(నవంబరు 21) 46 రోజులు  గడిచింది. ఈ దాడుల్లో 13వేలమందికి పైగా మరణించారు.

 చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం

ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక

మరిన్ని వార్తలు