London: లూటన్‌ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. విమానాలు రద్దు

11 Oct, 2023 12:32 IST|Sakshi

లండన్‌: లండన్‌లోని ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లండన్‌లోని లూటన్‌ విమానాశ్రయంలో ఉన్న కారు పార్కింగ్‌ ఏరియాలో మంటలు పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలో రాకపోకలను నిలివేశారు. ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు. 

వివరాల ప్రకారం.. లండన్‌లోని లూటన్‌ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులోని కారు పార్కింగ్‌ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి వేళ మంటల కారణంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దట్టమైన పొగను పీల్చుకున్న కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

ఇక, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్‌ ఏరియాలో దాదాపు 1200 వాహనాలు నిలిచి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఈవీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌ భవనం దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మేరకు నేటి (అక్టోబరు 11) నుంచి రేపు(అక్టోబర్‌ 12) మధ్యాహ్నం వరకు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. కాగా, విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌ వార్‌ వేళ పుతిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. యూఎస్‌ను టార్గెట్‌ చేసి.. 

మరిన్ని వార్తలు