కొలిన్‌ పావెల్‌ కన్నుమూత

19 Oct, 2021 04:31 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కొలిన్‌ పావెల్‌ సోమవారం (84) కోవిడ్‌తో కన్నుమూశారు. అమెరికా ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పదవి చేపట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇరాక్‌పై యుద్ధాన్ని సమరి్థంచుకునే క్రమంలో అపప్రథ మూటగట్టుకున్నారు. డెమోక్రాటిక్, రిపబ్లికన్‌ పారీ్టలకు చెందిన దేశాధ్యక్షుల హయాంలో ఆయన సమర్థవంతమైన సేవలందించారు.

అమెరికా సేనల పనామా ఆక్రమణ, 1991లో ఇరాక్‌ ఆర్మీ నుంచి కువాయిట్‌కు విముక్తి కలిగించడం వంటి వాటిలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే, 2003లో భద్రతామండలిలో అమెరికా విదేశాంగ మంత్రిగా పావెల్‌ చేసిన ప్రసంగంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. జనహనన ఆయుధాలను ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ రహస్యంగా నిల్వ చేసినట్లుగా ఆయన తప్పుడు ఆరోపణలు చేయడం.. అప్పటికే ఇరాక్‌పై అమెరికా యుద్ధం వెనుక అంతర్జాతీయ సమాజం అనుమానాలను మరింత బలపరిచింది. కొలిన్‌ పావెల్‌ ప్రతిష్టను దెబ్బతీసింది. 

మరిన్ని వార్తలు